వయసు మీదపడుతున్నా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవితో 'ఖైదీనెంబర్ 150', యువహీరో దగ్గుబాటి రానాతో తన తొలి చిత్ర దర్శకుడు తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనేమంత్రి' వంటి హిట్ చిత్రాలలో నటించింది. ఇక తమిళంలో స్టార్ అజిత్ నటించిన 'వివేగం'లో నటించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించకపోయినా కలెక్షన్లు బాగా సాధించింది. ఇక తాజాగా విడుదలైన ఇళయదళపతి విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రంలో సమంత, నిత్యామీనన్‌లతో కలిసి నటించింది. విజయ్‌తో మూడో చిత్రంగా ఇందులో నటించిన ఈమెకు ఈ చిత్రం సాధిస్తోన్న విజయం మరింత ఊపునిస్తోంది.
ఇక తెలుగులో తన మొదటి హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే', 'క్వీన్' రీమేక్‌గా కోలీవుడ్‌లో 'ప్యారిస్ ప్యారిస్' చిత్రాలలో నటిస్తోంది. వయసు మీద పడుతున్నా ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే ఈ అవకాశాలన్ని వస్తున్నాయి. ఇక తాజాగా ఈ చందమామ తాను తన ఫ్యాన్స్‌తో డేటింగ్‌కి రెడీ అని చెప్పింది. అయితే ప్లేస్, టైమ్ తానే నిర్ణయిస్తానని, డ్యూరేషన్ కూడా తన ఇష్టమేనని కండీషన్స్ పెట్టడంతో పాపం ఆమెతో డేటింగ్ చేయాలని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కి ఆశ... దోశ.. అప్పడం... వడ అంటూ వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక పెళ్లి విషయంలో ఈమె సూపర్‌సూక్తి చెప్పింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నామన్నది ముఖ్యం కాదు.. ఎవరిని చేసుకున్నామనేది ముఖ్యమని చెప్పి సినిమా డైలాగ్‌ని చెప్పుకొచ్చింది.