మెగాహీరోలందరూ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కానీ వీరిలో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ మాత్రం అభిమానులను నిరుత్సాహపరుస్తున్నాడు. దిల్‌రాజు పేరు వేసుకుని మార్కెటింగ్ చేయాలని భావించిన 'జవాన్' చిత్రం గత మూడు నెలల నుంచి వాయిదా పడుతూనే ఉంది. సెప్టెంబర్1న విడుదల చేద్దామంటే బాలయ్య 'పైసావసూల్' వస్తోందని భావించి వెనక్కి వెళ్లాడు. ఆ గ్యాప్ అలానే వస్తూ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. రైటర్ బివిఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు దిల్‌రాజుకి నచ్చకపోవడంతో.. ఈ గ్యాప్‌లోఆయన రీషూట్స్ చేయించాడని సమాచారం.
ఇక ఈ చిత్రంలో సాయి 'జవాన్' పాత్రలో కనిపించడంలేదని, ప్రతి పౌరుడు, ప్రతి ఇంట్లోనూ ఓ 'జవాన్' వంటి యువకుడుగా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని గతంలో చెప్పారు. కానీ తాజాగా ఇందులో సాయిధరమ్‌తేజ్ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా కనిపిస్తున్నాడని అంటున్నారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదు. ఆర్‌ఎస్‌ఎస్ నిజానికి మంచి క్రమశిక్షణ కలిగిన హిందు సంస్థ అయినప్పటికీ దీనిని ముస్లింలు ఇప్పటికీ అంటరాని సంస్థగానే చూస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌తో పాటు ఇతర హిందు సంస్థలకు చెందిన కార్యకర్తలే కరసేవకులుగా బాబ్రీమసీదు కూల్చారని ముస్లింలు అంటుంటారు. ముస్లింలు బాబ్రీమసీదు కూల్చివేత రోజుని బ్లాక్‌డే గా కూడా జరుపుకుంటారు. తప్పులేకపోయినా ఈ సంస్థ పలుసార్లు నిషేధానికి కూడా గురైంది.
ఇక మెగాభిమానుల్లో ముస్లింలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమలోని ముస్లింలు ఎందరో మెగాహీరోలను ఆదరిస్తుంటారు. మరి వారిని మనోభావాలు దెబ్బతినేలాగా సాయి ఇందులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా కనిపిస్తాడా? అనేది సస్పెన్సే. ఇక ఇదే నిజమైతే మాత్రం సాయిని మెచ్చుకోవాల్సిందే. ఇక స్నేహభర్త ప్రసన్న కీలక పాత్ర పోషించిన ఈచిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చిత్రాన్ని సోలో రిలీజ్‌గా డిసెంబర్1న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.