సీఎం చంద్రబాబు నాయుదు ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినన్ని విదేశీ పర్యటనలు బహుశా మోడీ కూడా చేసిఉండడు. దావోస్ వెళ్లి అదిగో పరిశ్రమలు, ఇదుగో పరిశ్రమలు అని చెప్పాడు. ఇక ఆయన మైండ్‌సెట్ అప్పుడు తొమ్మిదేళ్లు ఉన్నట్లుగానే ఉందని, మార్పు రాలేదని ఆయన పోకడ చూస్తుంటే అర్ధమవుతోంది. ఉద్యోగాలంటే కేవలం ఐటీపరిశ్రమ ద్వారానే వచ్చేవనే భ్రమలో బాబు ఉన్నాడు. మిగిలిన పరిశ్రమల పట్ల చూపనంత అవాజ్యమైన ప్రేమను ఇంకా ఆయన ఐటిపైనే చూపిస్తూ దానినే సర్వస్వం అని భావిస్తూ ఉన్నట్లు ఉన్నాడు.
తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని అక్కడి నుండి దుబాయ్ వెళ్లారు. నిజానికి ఇప్పటికే ఏపీలో ఉన్నవారి చేత ఇక్కడే పెట్టుబడులు పెట్టించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎంతసేపటికి ఎన్నారైలు, అమెరికాలో స్థిరపడిన ఐటీ నిపుణులు వెంటే పడుతున్నారు గానీ ఆంధ్రాలోనే ఉన్న భారీ వ్యాపార వేత్తలను, పారిశ్రామిక వేత్తలను మర్చిపోతున్నాడు. అంతెందుకు ఎందరో తెలుగుదేశం నాయకులు కూడా పరాయి రాష్ట్రాలలో పెట్టుబడులు పెడుతుంటే ఆయనవాటిని మన ఏపీలో పెట్టించడంలో విఫలమవుతున్నాడు.
పరిటాల సునీత బీర్ల ఫ్యాక్టరీని తెలంగాణలో పెట్టడం, సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి వారు ప్రత్యేక హోదా కొనసాగుతున్న రాష్ట్రాలలో ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ వంటి చోట వ్యాపారాలు పెడుతున్నారు. ఇక లగడపాటి రాజగోపాల్ నుంచి కావూరి సాంబశివరావు వంటి వారు కూడా పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఇక చంద్రబాబుకి, లోకేష్‌కి సింగపూర్‌లో వ్యాపారాలు ఉన్నాయనే వార్తల్లో ఎంత నిజమో తెలియదు గానీ మొత్తంగా ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన చంద్రబాబు తాను ఇప్పటికీ ఐటీ కంపెనీలకి సీఈవోగానే భావిస్తున్నాడని ఆయన మాటలు, చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోంది.