ఈ సినిమాకి మంత్రం వేసింది అర్జున్ రెడ్డే..!
Vijay Devarakonda New Movie Ye Mantram Vesave'అర్జున్ రెడ్డి' సినిమాతో స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా గురించి యువత మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండకి ఒక్కసారిగా కుర్రకారు బాగా కనెక్ట్ అయ్యారు. 'అర్జున్ రెడ్డి' కేరెక్టర్ లో తమని తాము చూసుకుని వారు ఆ కేరెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే విజయ్ నెక్స్ట్ సినిమా మీద అందరికి అంత ఆసక్తి. ఇకపోతే 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలకు ముందే విజయ్ ఒక ప్రేమ కథ చిత్రాన్ని మొదలు పెట్టాడు. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో ‘ఏ మంత్రం వేసావె’ అనే సినిమాలో విజయ్ దేవరకొండ నటించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.
కానీ ఇప్పుడు తాజాగా దీపావళి సందర్భంగా ఈ ‘ఏ మంత్రం వేసావె’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా విడుదల అంటున్నారు. అయితే ఈ ‘ఏ మంత్రం వేసావె’ చిత్రానికి సెన్సార్ జరిగి ఒక నెల కావొస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కానీ ఈ సినిమా ఇప్పటివరకు అనేకానేక కారణాలతో విడుదలకు నోచుకోకుండా ఉండిపోయింది. అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల వరకు ఈ సినిమా ఒకటి షూటింగ్ జరుగుతున్నట్లుగా కూడా ఎవరకి ఒకింత సమాచారం కూడా లేదు. ఇక ఈ సినిమాని ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సినిమాకొచ్చిన క్రేజ్ తోనే విడుదలకు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినబడుతుంది.
ఇక ‘ఏ మంత్రం వేసావె’ ఫస్ట్ లుక్ లో విజయ్ దేవరకొండ చాలా దీనంగా పడుకొని ఏదో పరధ్యానంలో ఉండడం చూస్తుంటే.. ఇదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ని తలపిస్తుంది అంటున్నారు. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలోని పాత్రకు ఈ సినిమాలోని పాత్రకు చాలా తేడా కనిపిస్తుందంటున్నారు. మరి 'అర్జున్ రెడ్డి' క్రేజ్ ని విజయ్ ఈ సినిమాతో ఎలా క్యాష్ చేసుకుంటాడో చూద్దాం.
Ye Mantram Vesave Depended on Arjun Reddy Craze






































