మన పెద్దలు శత్రువుకి, శత్రువు మనకి మిత్రుడని ఏనాడో చెప్పారు. ఈ విషయమే రాజశేఖర్ ప్రూవ్ చేస్తున్నాడని అనిపిస్తోంది. రాజశేఖర్‌కి చిరంజీవికి పడదు. అదే విధంగా బాలయ్య-చిరంజీవిల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్నా, ప్రొఫెషనల్ వైరం మాత్రం ఉంది. దీంతోనే రాజశేఖర్ నటించిన 'ఎస్వీగరుడవేగ' ట్రైలర్ లాంచ్‌కి బాలయ్య ఒప్పుకున్నాడని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు సీనియర్ హీరోలను వేదిక పైన చూస్తేనే అందరికీ కను విందుగా ఉంటుంది. అదే ఫీలింగ్‌ను ఈ ట్రైలర్ లాంచ్‌లో రాజశేఖర్, బాలయ్య అత్యంత అనోన్యంగా ఉండటం కలిగించింది.
ఇక ఈ వేడుక జరిగినంత సేపు రాజశేఖర్ బాలయ్యని 'సార్...సార్' అని పలకరిస్తూ ఉన్నాడు. ఇక తాను బాలయ్య కలిసి ఓ సినిమా చేయనున్నామని, అందులో బాలయ్య హీరో అయితే తనది సపోర్టింగ్ రోల్, ప్రవీణ్‌సత్తార్ దర్శకుడు అని రాజశేఖర్ చెప్పేశాడు. ఇది నిజమవుతుందో లేదో తెలియదుగానీ బాలయ్య విలన్‌గా పరిచయం చేసిన జగపతిబాబు మంచి ఫామ్‌లో దున్నేస్తున్నాడు. త్వరలో హీరో శ్రీకాంత్‌కి కూడా తన చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌రోల్‌ని ఇస్తున్నాడు. త్వరలో రాజశేఖర్‌కి కూడా హీరో అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి ఆయన్ను తన చిత్రంలో విలన్‌గా పెట్టుకున్నా ఆశ్యర్యం లేదు.
ఇక విలన్ పాత్రల గురించి ఇటీవల రాజశేఖర్ మాట్లాడుతూ,'ధృవ'లో అరవింద్‌స్వామి పాత్ర తన వద్దకే వచ్చిందని, కానీ తర్వాత ఇందులో అరవింద్‌స్వామినే పెట్టుకుంటున్నామని, ఆయన నటిస్తే ఆయనపై సోలో సీన్స్‌ని తమిళం నుంచే తీసుకుంటామని చెప్పడంతో తాను డ్రాప్ అయ్యానని చెప్పాడు. ఇక బాలయ్య తనకు తాజా చిత్రంలో ఓ విలన్ పాత్రను ఆఫర్ చేశాడని, కానీ పాత్ర రొటీన్‌గా ఉండటంతో బాలయ్య ఆఫర్ చేసిన పాత్ర నో అని చెబితే బాగుండదని తలచి, నేను బిజీ అని చెప్పానని ఆయన తెలిపాడు. ఇక బాలయ్య ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని, బాలయ్య అదృష్టం వల్ల తమ చిత్రం కూడా హిట్ అవుతుందని రాజశేఖర్ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.