Advertisementt

అర్చన కూడా బిగ్ బాస్ వాడకం స్టార్ట్ చేసింది!

Sat 21st Oct 2017 10:28 AM
archana,bigg boss,nuvvostanante nenoddantana,bollywood  అర్చన కూడా బిగ్ బాస్ వాడకం స్టార్ట్ చేసింది!
Archana Revealed her Future Plans అర్చన కూడా బిగ్ బాస్ వాడకం స్టార్ట్ చేసింది!
Advertisement
Ads by CJ

నటి అర్చన అలియాస్‌ వేద కూడా రాయ్‌లక్ష్మి బాటలో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తెలుగులో 'నేను,  నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి పలు చిత్రాలలో నటించిన ఈమె తెలుగులో సక్సెస్‌ కాలేకపోయింది. ఈమె ఇప్పటికే ఓ బాలీవుడ్‌ చిత్రంతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ఫేడవుట్‌ అయిందని భావించిన ఈమె ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసిన 'బిగ్‌బాస్‌' సీజన్‌ 1లో ఐదో స్థానం సాధించింది. ఇప్పటివరకు ఈమె ఓవర్‌ఎక్స్‌పోజింగ్‌ చిత్రాలు పెద్దగా చేయలేదు. 

ఈమె తాజాగా మాట్లాడుతూ.. నటిగా మంచి చిత్రాలలో నటించాలని ఉందని, బిగ్‌బాస్‌తో ప్రేక్షకులకు మరలా కనిపించిన తర్వాత మరోసారి సినిమాలలో కనిపించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. త్వరలో ముంబై వెళ్తానని చెప్పింది. నిజమే తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలలో నటించి, తాను బాధపడటంతో పాటు ప్రేక్షకులను బాధపెట్టే బదులు, బాలీవుడ్‌లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేసినా ఆమె మరలా లైమ్‌లైట్‌లోకి రావచ్చు. 

ఇక ఆమె తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ, మంచి వాడు, మంచి మనసున్న వాడు.. అందరినీ గౌరవించేవాడు...మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించే వాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. చివరగా తెలుగు వ్యక్తిని అయి ఉండి.. తెలుగులో నటించకపోతే ఎలా అనుకుందేమో గానీ మంచిపాత్రలు వస్తే తెలుగులో నటిస్తానని, ఇక్కడి నిర్మాతలకు, దర్శకహీరోలకు మెసేజ్‌ పెట్టింది. మరి 'బిగ్‌బాస్‌' పైనే ఎన్నో ఆశలుపెట్టుకున్న ఈమె ఎంత వరకు ఆ ఫలితాలను అందుకుంటుందో వేచిఊడాల్సివుంది....!

Archana Revealed her Future Plans:

Archana Starts Bigg Boss Craze for Her Future

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ