Advertisementt

చైతు - సమంత మినీ హనీమూన్ ప్లాన్ ఇదే!

Sat 21st Oct 2017 12:28 AM
samantha,new zealand,naga chaitanya,mini honeymoon,akkineni family,nagarjuna and amala  చైతు - సమంత మినీ హనీమూన్ ప్లాన్ ఇదే!
Samantha and Naga Chaitanya Mini Honeymoon Details చైతు - సమంత మినీ హనీమూన్ ప్లాన్ ఇదే!
Advertisement
Ads by CJ

అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య, అఖిల్ పెళ్లి కొద్దీ రోజులు అటు ఇటుగా వుంటుంది అనుకుంటే.. అఖిల్ పెళ్లి తప్పిపోయి... నాగచైతన్య పెళ్లి మాత్రం అయిపొయింది. నాగ చైతన్య కన్నా ముందే అఖిల్ నిశ్చితార్ధం జరిగింది. కొన్ని కారణాల వలన ఆ పెళ్లి జరగలేదు. అయితే చైతు - సమంతల నిశ్చితార్ధం, పెళ్లి కూడా గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా జరిగిపోయాయి. ఇక నాగార్జున కూడా కాస్త కూల్ అయ్యాడు. తాను నటించిన రాజుగారి గది2కి మిశ్రమ స్పందన రావడం, చైతు పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరగడంతో ఇప్పుడు నాగ్.. అమలతో కలిసి రిలాక్సేషన్ కోసం విదేశాలకు వెళ్లిపోతున్నాడు. ఇక వచ్చాక రామ్ గోపాల్ వర్మతో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు నాగ్.

ఇక నాగచైతన్య - సమంతలు పెళ్లి అయ్యి 15 రోజులు గడుస్తున్నా వారు మాత్రం హానీమూన్ లేకుండా.. సమంత తన సినిమాల విషయంలో బిజీ కాగా... చైతు మాత్రం తన అప్ కమింగ్ మూవీ సవ్యసాచి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరి ఈ జంట కూడా ఇప్పుడు మినీ హనీమూన్ ని ప్లాన్ చేసుకుంటున్నారట. అసలు తమ హనీమూన్ ని డిసెంబర్ కి వాయిదా వేసుకున్న ఈ జంట ఇప్పుడు మినీ హనీమూన్ అంటూ న్యూజిలాండ్ కి ఎగిరిపోనున్నారనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. సమంత తమ హానీమూన్ ఇప్పుడే కాదని చెబుతున్నప్పటికీ.. ఈ యువ జంట కనీసం ఒక వారం పాటు ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచనతో న్యూజిలాండ్ చెక్కేస్తున్నట్టుగా  చెబుతున్నారు.

సమంత తన సినిమాలు రంగస్థలం, మహానటి సినిమాల కాల్షీట్స్ ని అడ్జెస్ట్ చేసుకుని మరీ ఈ మినీ హనీమూన్ కి ప్రిపేర్ అవుతుందంటున్నారు. ఇక ఈ మినీ హనీమూన్ పూర్తవగానే నాగచైతన్య తన కొత్త సినిమా చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచిని స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉండగా.. సమంత కూడా తన సినిమాల షూటింగ్ ని కంప్లీట్ చేస్తుందంటున్నారు. ఇక ఈ మినీ హనీమూన్ లో ఈ జంట న్యూజిలాండ్ కి వెళ్లొచ్చాక.. అలాగే నాగ్ - అమల ల టూర్ ముగిశాక చైతు - సామ్ ల రిసెప్షన్ ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే చైతన్య - సమంతల ఒక రిసెప్షన్, చైతు తల్లి లక్ష్మి ఆధ్వర్యంలో సింపుల్ గా జరిగింది. 

Samantha and Naga Chaitanya Mini Honeymoon Details:

Samantha and Naga Chaitanya Mini Honeymoon in New Zealand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ