పుత్రోత్సాహం అనేది తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు రాదు.. ఆ కొడుకు ప్రయోజకుడై పలువురి ప్రశంసలు పొందుతున్నప్పుడే వస్తుందని ఏనాడో మహాకవి చెప్పాడు. అది మాస్‌మహారాజాకి ఇప్పుడు అనుభవం అవుతోంది. రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' చిత్రం తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్‌ని సాధిస్తోంది. ఇక ఈచిత్రంలో రవితేజ చిన్ననాటి పాత్రను ఆయన కుమారుడు మహాధన్ పోషించి మెప్పించాడు. దీనిపై దర్శకుడు అనిల్‌రావిపూడి మాట్లాడుతూ, ఈ చిత్రంలో రవితేజ చిన్నతనాన్ని కూడా చూపించాల్సి వుంది. చిన్నప్పుడు రవితేజ పాత్ర చేసే బాలనటునికి పెద్దయిన తర్వాత రవితేజ నటించే పాత్రకు మద్య పోలికలు చాలా అవసరం. దాంతోనే రవితేజకి ఆయన కుమారుడు నటించేందుకు ఒప్పించి నటింపజేశానని తెలిపాడు.
ఇక ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు దర్శకులు మహాధన్ చేత పాత్రలు చేయిస్తామని అడిగినా నేను వద్దన్నాను. అనిల్ మీద నమ్మకం.. పాత్ర బాగా ఉండటంతో ఈ చిత్రంలో నటింపజేశాను. ఈ పాత్రకు మంచిపేరు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని రవితేజ తెలిపాడు. ఇక రవితేజకు అండగా ఎవ్వరూ లేకపోయినా చిన్న చిన్న పాత్రలు చేస్తూ మాస్‌మహారాజా స్థాయికి చేరుకుని స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. కానీ తన కొడుకుకి అంత కష్టం లేకుండా తన వారసత్వాన్ని రవితేజ కూడా తన కుమారుడు మహాధన్‌కి ఇవ్వనున్నాడు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ మెహ్రీన్ పెద్ద మైనస్‌పాయింట్ అయింది అంటున్నారు. నటనాపరంగా పెద్ద సత్తా లేకపోయినా గ్లామర్ పాత్రల ద్వారా ఈమె మెప్పిస్తుందని పలువురు భావించారు. కానీ ఈచిత్రంలో అమ్మడు చాలా బొద్దుగా కనిపించి ప్రేక్షకులను నిరాశపరిచింది. సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్‌లాగా బాడీ ఫిట్నెస్ మెయిన్‌టెయిన్ చేయకపోవడంతో ఆమె గ్లామర్ చూపించే సన్నివేశాలలో, పొట్టి పొట్టి దుస్తులు, స్కర్ట్స్, షార్ట్స్ వంటివి వేసిన సమయంలో ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగైతే ఈ అమ్మడు అతిత్వరగా ఆర్తిఅగర్వాల్, నమితలా కనుమరుగు కావడం ఖాయమంటున్నారు.