'బాహుబలి' లో దేవసేనగా జాతీయ స్థాయిలో పేరు కొట్టేసిన అనుష్క 'బాహుబలి' తరువాత కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. అయితే ప్రస్తుతం అనుష్క 'బాహుబలి' టైం లో ఓకే చేసిన 'భాగమతి' అనే సినిమా మీద శ్రద్ధ పెడుతుంది. 'పిల్ల జమిందార్' దర్శకుడు అశోక్ 'భాగమతి' సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. గ్రాండ్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 'బాహుబలి' సినిమా తెరకెక్కుతున్న టైం లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి కావొచ్చింది. ఇక షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్ వర్క్ విషయం పెండింగ్ లోనే ఉందంటున్నారు. అయితే గ్రాఫిక్స్ పనులను అశోక్ దగ్గరుండి చూసుకుంటున్నాడని కూడా చెబుతున్నారు.
యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ముందు అనుకున్నదానికన్నా ఎక్కువ బడ్జెట్ ఎక్కిందని ప్రచారం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. అంతేకాకుండా తాజాగా... అనుష్క విషయమై కూడా భారీ ఖర్చు ఈసినిమాకి అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అనుష్క భారీగా బరువు పెరిగి దాన్ని తగ్గించుకునే పద్ధతులు ఎన్ని ఫాలో అయినా.. ఉపయోగం లేకుండా పోయింది. మరి అలా అనుష్క ఫిట్ నెస్ లోపం వల్ల సినిమాకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని..... ఆమె శరీర ఆకృతిని గ్రాఫిక్స్ తో అందంగా కనిపించేలా కవర్ చేసినట్లు తెలుస్తోంది.
కేవలం అనుష్క లుక్ కోసమే నిర్మాతలు దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం అందుతుంది. మరి ఇంతకు ముందే బాహుబలిలో రాజమౌళి.. అనుష్కని అందంగా చూపించడం కోసం గ్రాఫిక్స్ వాడారని ప్రచారం ఉంది. మరి ఇప్పుడు 'భాగమతి' కోసం అనుష్కకి ఐదు కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ చేశారనేది నిజమంటున్నారు. ఇకపోతే 'భాగమతి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని అనుష్క బర్త్ డే కానుకగా నవంబర్ 7 న రిలీజ్ చేస్తారని చెబుతున్నారు.