చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడి ఒక కూతురికి తల్లయినాక అతనితో విభేదాలు వచ్చి విడిపోయింది. కన్న కూతురు తన కళ్ళముందే ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా గమ్మునున్న చిరు.. ఆతర్వాత భర్తతో తెగతెంపులు చేసుకుని తనదగ్గరికి వచ్చిన కూతుర్ని, మనవరాలిని అక్కున చేర్చుకుని కొన్ని రోజుల తర్వాత శ్రీజని శ్రీజ చిన్న నాటి స్నేహితుడు కళ్యాణ్ కిచ్చి మళ్ళీ అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు చిరంజీవి. ఈ పెళ్లి వేడుకని సింపుల్ గా బెంగుళూరు ఫామ్ హౌస్ లో జరిపించి... రిసెప్షన్ ని మాత్రం గ్రాండ్ గా హైదరాబాద్ లో అతిరథ మహారధులు మధ్యన జరిపించాడు. శ్రీజ - కళ్యాణ్ ల వివాహం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఒక కూతురున్న శ్రీజను పెద్ద మనసుతో కళ్యాణ్ వివాహం చేసుకున్నాడనే టాక్ వచ్చింది.
అయితే వారెంత అన్యోన్యంగా ఉంటున్నారో అనేది పక్కన బెడితే... చిరు చిన్నల్లుడిగా కళ్యాణ్ నిత్యము వార్తల్లోనే ఉంటున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ కూడా హీరోలా ఉంటాడు కాబట్టి సినిమా హీరో అవతారం ఎత్తుతున్నాడని... ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని.. చిరు చిన్నల్లుడి సినీ అరంగేట్రం అంటూ వార్తలొస్తున్నాయి. ఇక కళ్యాణ్ కూడా కత్తిలా ఉంటాడు కాబట్టి అది నిజమే అని అందరూ ఫిక్స్ కూడా అయ్యారు. ఇకపోతే కళ్యాణ్... శ్రీజని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడనే విషయం గత రాత్రి చిరు ఇంట జరిగిన ప్రీ దీపావళి సెలెబ్రేషన్స్ లో తీసిన ఫొటోస్ ను బట్టి అర్ధమవుతుంది.
మెగా స్టార్ చిరంజీవి తమ కుటుంబ సభ్యులతో పాటే సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది దర్శకులు అంటే సురేందర్ రెడ్డి ఫ్యామిలీ, సుకుమార్ ఫ్యామిలీ, రామ్ చరణ్, ఉపాసన, అఖిల్, అల్లు అర్జున్, శిరీష్, చిరు ఇంట ఇచ్చిన ఈ దీపావళి సెలెబ్రేషన్స్ కి హాజరయ్యారు. ఈ మధ్య చిరు తన మనవరాలిని హాస్టల్ లో పెట్టారని రకరకాలుగా వార్తలు వినిపించాయి. కానీ ఈ పార్టీలో శ్రీజ, కళ్యాణ్ తమ కూతురిని ఎత్తుకుని దిగిన ఫోటోతో అవన్నీ గాలి వార్తలని తెలిసిపోతుంది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కళ్యాణ్ తో శ్రీజ, శ్రీజ కూతురు చూడముచ్చటగా ఎంతో ఆనందంగా కనబడుతున్నారు. ఆ ఫొటో ఇదే.