ఇప్పటికే జగన్ తనను తాను ముఖ్యమంత్రిని అవుతానని కలులు కంటున్నాడని, ఆయన తనకు తానే 30ఏళ్లు సీఎంగా పనిచేస్తానని చెప్పుకొంటున్నాడని టిడిపి నేతల నుంచే గాక సాధారణ ప్రజల నుంచి కూడా వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి. రాజీనామా చేయకుండా పార్టీ దూకుతున్న జంప్‌జిలానీల వంటి విషయాలపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పనిచేయకుండా, ఆయన భ్రమల్లో బతుకుతున్నాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున తనకిచ్చిన ప్రతిపక్ష నాయకుడి హోదాను సద్వినియోగం చేసుకోకుండా.. కేవలం జగన్, రోజా, అంబటి రాంబాబు వంటి వారు తమ సత్తాపై కాకుండా చంద్రబాబుపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనే చూస్తూ, తమ వ్యూహాలు రచిస్తుండటంతో అవి వారికే బెడిసికొడుతున్నాయనేది విశ్లేషకుల మాట.
తాజాగా కూడా జగన్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అందరం కలిసి అన్నను ముఖ్యమంత్రిని చేసి, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. నేను సీఎం అయిన తర్వాత చేనేత, వృత్తిపనులు చేసుకునే బడుగు కూలీలకు 45 ఏళ్లు నిండితేనే పెన్షన్ ఇస్తాను. పెన్షన్ 1000 రూపాయలు కాదు.. రూ.2000 ఇస్తాను. ఒక మంచి అన్నయ్య సీఎం కుర్చీలో కూర్చుంటాడని తనకు తాను కితాబిచ్చుకున్నాడు.
చంద్రబాబు ఆప్కోను నీర్వీర్యం చేశాడని చేనేత కార్మికులనుద్దేశించి చెప్పాడు. మనసున్న నాయకుడు వైఎస్‌ఆర్ అని మాత్రమే ప్రజలు అనుకుంటున్నారని, ఆయన పాలనను తిరిగి తెస్తానన్నాడు. పేదలు పనులకు పోతేనే కడుపు నిండుతుందని, చంద్రబాబు పాలనలో పనులు దొరకడం లేదని, ఆయన చెప్పే మాటలకు బడ్జెట్‌లోని కేటాయింపులకు అసలు సంబంధమే ఉండదని వ్యాఖ్యానించాడు.