'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఇమేజ్ అన్ని వుడ్‌లలో, దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఆయన నేషనల్‌స్టార్‌గా, టాలీవుడ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. దాంతో ఆయన సినిమాల కోసం టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రభాస్ తదుపరి చిత్రం 'సాహో'ని కూడా ఒకే సారి మూడు భాషల్లో రూపొందిస్తూ, మిగిలిన భాషల్లోకి డబ్బింగ్ చేయనున్నారు. ఈసారి పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా, హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ధీటుగా, యాక్షన్ హీరోగా ప్రభాస్ ఇందులో అదరగొడుతున్నాడని సమాచారం.
ఇక ఆయన పుట్టినరోజు కానుకగా ఈనెల 23న ఈ చిత్రం ఫస్ట్‌లుక్, మేకింగ్ వీడియో విడుదల చేస్తే చిత్రంపై కనీస అంచనాలు వస్తాయి. ఈ చిత్రం తనకు హోమ్ బేనర్ అయినా యువి క్రియేషన్స్‌లో రూపొందనుండటం, సినిమా విషయాలు బయటకి రాకుండా యూనిట్ జాగ్త్రతలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ప్రభాస్ కనుసన్నలలో జరుగుతున్నాయి. మేకింగ్‌కి ఎక్కువ సమయం తీసుకుని ప్రశాంతంగా మంచి ప్రమోషన్స్‌తో వచ్చే దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం సుకుమార్-రామ్‌చరణ్‌ల 'రంగస్థలం 1985' విడుదల సంక్రాంతికే అంటున్నారు. తప్పని పరిస్థితుల్లో తన బాబాయ్ పవన్ చిత్రంతో రామ్‌చరణ్ పోటీ పడక తప్పని స్థితి ఉంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రామ్‌చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. దీనిని జనవరి నెలాఖరులో ప్రారంభించి, ఫిబ్రవరి నుంచి సెట్స్‌కి తీసుకెళ్లి, దీనిని కూడా ప్రభాస్‌కి పోటీగా దసరాకి తేవాలని భావిస్తున్నారు. అంటే వచ్చే ఏడాది చరణ్ రెండు చిత్రాలతో రానుండటం ఆయన అభిమానులకు సంతోషమే అయినా ప్రభాస్ 'సాహో'తో పోటీ అంటే ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది...!