తనను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విషయంలో విమర్శించే వారికి వర్మ తన వ్యంగ్యపు సెటైర్లతో రెచ్చిపోతూ నానా రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిత, వాణివిశ్వనాథ్‌లను ఓ ఆటాడుకున్న ఆయన తాజాగా టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనపై చేసిన విమర్శలన్నింటిని పరీక్షల్లో ప్రశ్నలు, జవాబుల రూపంలో సంధించాడు. ప్రభాకర్‌చౌదరి.. రాంగోపాల్‌వర్మ అనే వ్యక్తి ఓ సైకో అంటే దానికి వర్మ 'అవునా డాక్టరు గారూ..మీరు సైక్రియాటి చదివారా? అరెరె.. మీరు చదువురాని వారనుకున్నాను' అన్నాడు. కులాల మీద, రాజకీయాల మీద ఇష్టం వచ్చినట్లు సినిమా తీయకూడడు అనే విమర్శకు 'అంటే ఇష్టం లేనట్లు తీస్తే ఓకేనా డాక్టర్ గారూ...' అంటూ వ్యంగ్యోక్తులు విసిరాడు.
సినిమాని తీసేముందు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి అనే విమర్శకు స్పందిస్తూ 'ఇంతకన్నా సైకో మాట ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇచ్చివుండరు' అన్నారు. ఎన్టీఆర్‌ని వ్యక్తిగతంగా ఇనుమడింపజేసేలా ఉండాలనే దానికి స్పందిస్తూ 'అయ్య నాయనో .. ఎవ్వరికి తట్టనంత గొప్ప మాట చెప్పావు చౌదరి..నీ కడుపు చల్లంగుండ' అని వర్మ రెచ్చిపోయాడు. ఎన్టీఆర్‌కి కించపరుస్తూ చిత్రం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటావని వర్మని చౌదరి హెచ్చరించిన దానికి రిప్లై ఇస్తూ.. 'ఊరుకోక డ్యాన్స్ చేస్తారా సార్.. లేక పాట కూడా పాడుతారా' అన్నారు.
దర్శకుడు అన్నతర్వాత సినిమాల ద్వారా ప్రజలను ఆనందింపజేయాలి, రంజింపజేయాలి, మంచి సందేశం అందించాలి అనే విమర్శకు....'అబ్బో సినిమా మీద మీకున్న అమోఘమైన అవగాహన చూస్తే రాజమౌళి పొట్టకూడా కొట్టేట్లు ఉన్నారు బాబోయ్' అన్నారు. ఇక ప్రభాకర్ చౌదరి ఈచిత్రం వెనుక వైసీపీపార్టీ వారు ఉన్నారు.. అనే విమర్శకు ఆయననిచ్చిన సమాధానం వర్మ మాటలకు పరాకాష్టగా చెప్పవచ్చు. తాజాగా వర్మ తనకు ఈ చిత్రం స్క్రిప్ట్‌లో ఎన్టీఆర్ ఆత్మ సహకరిస్తూ, తనకు కొండంత ధైర్యం ఇస్తూ.. తనను ముందుకు తీసుకెళ్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఆత్మలు, దేవుళ్లంటే నమ్మకం లేదనే వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ అనే దాని ద్వారా మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యేందుకే ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నారు.