Advertisementt

విజయ్ దేవరకొండకి మరో కొత్తమ్మాయ్!

Wed 18th Oct 2017 08:47 PM
priyanka jawalkar,vijay devarakonda,rahul sankrityayan  విజయ్ దేవరకొండకి మరో కొత్తమ్మాయ్!
Priyanka Jawalkar in Vijay Devarakonda Movie విజయ్ దేవరకొండకి మరో కొత్తమ్మాయ్!
Advertisement
Ads by CJ

'పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి' సినిమాల హిట్ తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. 'పెళ్లి చూపులు' హిట్ అయినా కూడా.. 'అర్జున్ రెడ్డి' సినిమాతోనే విజయ్ సూపర్ నటుడిగా అవతారం ఎత్తాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికి కొంతమంది 'అర్జున్ రెడ్డి' గురించి తలుస్తూనే ఉన్నారు. అయితే విజయ్ 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత ఎలాంటి సినిమాతో రాబోతున్నాడా అనే ఆసక్తి మాత్రం అందరిలో నెలకొంది. ఇప్పుడిప్పుడే విజయ్ నటించబోయే ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. 

తాజాగా విజయ్ దేవరకొండ... రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ సినిమాకి ఓకే చెప్పేశాడు. ఇక ఈ సినిమాలో విజయ్ తో రొమాన్స్ చెయ్యడానికి ఒక అచ్చమైన తెలుగమ్మాయి రెడీగా ఉందట. ఆ అమ్మాయి ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకే పెద్ద క్రేజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్‌ అనే అమ్మాయిని విజయ్ సరసన నటించేందుకు ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రియాంక ఫైనల్ అంటున్నారు. ఇకపోతే చాలాసార్లు ఆడిషన్స్ కి పిలిచి చివరిగా తనని ఈ సినిమాకి ఎంపిక చేసినందుకు ప్రియాంక కూడా మురిసిపోతుంది.

మరి 'పెళ్లి చూపులు' సినిమాలో తెలుగమ్మాయి రీతూ వర్మతో నటించిన విజయ్ దేవరకొండ... 'అర్జున్ రెడ్డి' సినిమాలో షాలిని పాండే అనే కొత్తమ్మాయితో నటించి అదరగొట్టాడు. మరి ఇప్పుడు మరో కొత్త అమ్మాయిని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దింపుతున్నాడన్నమాట. 

Priyanka Jawalkar in Vijay Devarakonda Movie:

Vijay Devarakonda New Movie Heroine Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ