Advertisementt

పవన్ టైటిల్ విషయంలో త్రివిక్రమ్ దోబూచులాట!

Wed 18th Oct 2017 05:11 PM
pawan kalyan,pspk25,trivikram srinivas,title,agnathavasi  పవన్ టైటిల్ విషయంలో త్రివిక్రమ్ దోబూచులాట!
Trivikram Chooses 3 Titles for PSPK25 పవన్ టైటిల్ విషయంలో త్రివిక్రమ్ దోబూచులాట!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ 'అజ్ఞాతవాసి' గా దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక చిత్ర బృందం కూడా అజ్ఞాతవాసికే ఫిక్స్ అవడమూ.. టైటిల్ రిజిస్టర్ చేయించడము జరిగిపోయాయి. ఇక మేకర్స్ అధికారికంగా పవన్ అజ్ఞాతవాసి టైటిల్ ని బయటికి వదలడమే ఆలస్యం..  అయితే ఈ లోపే ఈ టైటిల్ జనం నోళ్ళలో, ఫ్యాన్స్ నోళ్ళలో బాగా నానితే పవన్ చిత్రానికి హైప్ క్రియేట్ అవుతుందని.... అందుకే టైటిల్ ని డైరెక్ట్ గా బయటికి వదలకుండా ఇలా లీకులీస్తున్నారనే టాక్ బయటికి వచ్చింది.

త్రివిక్రమ్ ఎంతో తెలివిగా పవన్ సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ ని పవన్ పుట్టినరోజుకు ముందే రెడీ చేశాడట.... కానీ అప్పుడు ఆ టైటిల్ ని ఎటువంటి హడావిడి లేకుండా వదిలితే కిక్ ఉండదని.. అంతేకాకుండా ఒక్కసారిగా టైటిల్ ని రివీల్ చేస్తే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావొచ్చనే ఆలోచనతో పవన్ పుట్టిన రోజున టైటిల్ రెడీ అయినా వదలకుండా హైప్ క్రియేట్ చేసి... కేవలం కాన్సెప్ట్ పోస్టర్ తోనూ, మ్యూజికల్ బిట్ తోనూ సరిపెట్టేశాడంటున్నారు. కొద్దిగా లీకులిస్తే అజ్ఞాతవాసి టైటిల్ జనంలోకి వెళ్లి అందరి నోళ్ళలో బాగా నానుతుంది కాబట్టి ఇప్పుడు ప్రకటిస్తే మంచి మజా వస్తుందని ప్లాన్ చేశాడనే ప్రచారం జరుగుతుంది.

ఇక త్రివిక్రమ్ నిజంగా అలా ప్లాన్ చేసాడో లేదో తెలియదు గాని... అజ్ఞాతవాసి టైటిల్ కి మాత్రం పవన్ ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా బాగానే కనెక్ట్ అయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ టైటిల్ కి గనక నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే మరో మూడు టైటిల్స్ ని కూడా త్రివిక్రమ్ రెడీ చేసి పెట్టుకున్నాడట. అజ్ఞాతవాసి కాకపోతే మరో టైటిల్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడట. అయితే అజ్ఞాతవాసి టైటిల్ త్రివిక్రంతోపాటే పవన్ కి చిత్ర బృందానికి... అలాగే పవన్ ఫ్యాన్స్ కి కూడా పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. 

ఇక ఈ టైటిల్ రేపు దీపావళి కానుకగా విడుదల చేస్తారనే టాక్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది జరిగేలా కనబడడం లేదంటున్నారు. చూద్దాం ఫైనల్ గా దీపావళికి పవన్ బయటికి వస్తాడో రాడో.

Trivikram Chooses 3 Titles for PSPK25 :

Agnathavasi Title Register for PSPK25 Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ