Advertisementt

ఎక్స్ ఫోజింగ్ చేయనంటే చేయనంటోంది!

Wed 18th Oct 2017 12:52 PM
keerthy suresh,nenu local,nenu sailaja,glamour role  ఎక్స్ ఫోజింగ్ చేయనంటే చేయనంటోంది!
Keerthy Suresh No to Exposing ఎక్స్ ఫోజింగ్ చేయనంటే చేయనంటోంది!
Advertisement
Ads by CJ

నిన్నటితరంలోనే కాదు.. నేటితరంలో హీరోయిన్లు కూడా తమ కెరీర్‌ ప్రారంభంలో పద్దతిగా నటిస్తూ , అవకాశాలు, స్టార్స్‌ పట్టించుకోవడం లేదని గ్లామర్‌ డోస్‌ని పెంచి గేట్లు తెరిచి అందాలను ఆరబోస్తుంటారు. ఇక ఇది మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీ. కాబట్టి హీరోయిన్లు కేవలం గ్లామర్‌డాల్స్‌గా ఉంటున్నారు. ముసలిహీరోలకు, తాతవయసు వచ్చిన వారికి కూడా ఇద్దరు కాదు. ఏకంగా ముగ్గురు నలుగురు కుర్రహీరోయిన్లు కావాల్సిందే. కూతురు, మనవరాలి వయసులో డ్యూయెట్లు ,శృంగార సన్నివేశాలు, చిందులు, కుమ్ముడు అలవాటైపోయింది. 

ఇంకా వీలుంటే లక్ష్మీరాయ్‌ నుంచి సన్నిలియోన్‌ నుంచి అనసూయ దాకా స్పెషల్‌సాంగ్‌ అని కొందరు , ఐటం సాంగ్‌ అని మరికొందరు పేర్లు పెట్టి వారి అందాల ఆరబోత ఖచ్చితంగా ఉండాలంటారు. దీంతో ఏమాత్రం ఎక్స్‌పోజింగ్‌ చేయడానికి ఇష్టపడని వారిని పొట్టి అనో లేక పొగరు అనో ఫీల్డ్‌ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. నిత్యామీనన్‌ వంటి వారి విషయంలో ఇదే జరిగింది. ఇక సౌందర్య తర్వాత ఆ స్థాయిలో ఎవ్వరూ నిలబడలేదు. ఇక తాజాగా 'ఫిదా'తో సాయిపల్లవి, 'రారండోయ్‌ వేడుక చూద్దాం, జయజానకి నాయకా'తో రకుల్‌, 'నిన్నుకోరి' లతో నివేధాథామస్‌ వంటి వారు చేసినటు వంటి పాత్రల్లోనే తాను ఇక నటిస్తానని తాజాగా సమంత కూడా చెప్పేసింది. 

ఇక మరో మలయాళీభామ కీర్తిసురేష్‌ 'నేను శైలజ' తర్వాత 'నేను లోకల్‌' తో పాటు విజయ్‌ వంటి టాప్‌స్టార్‌ సరసన కూడా ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. ఆమె తాజాగా మాట్లాడుతూ, నాకు గ్లామర్‌ పాత్రలు సరిపోవు. అలా వచ్చిన అవకాశాలను కావాలనే పక్కన పెడుతున్నాను. నేను గ్లామర్‌ విషయంలో ఇదే మాట ఐదేళ్ల తర్వాత అయినా చెబుతాను. నేను గ్లామర్ పాత్రలు చేయనని తేల్చిచెప్పేసింది. ఇక ఆమె ప్రస్తుతం 'మహానటి'లో సావిత్రి పాత్ర, పవన్‌కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ల చిత్రంలో కూడా పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌, పద్దతైన పాత్రలు చేస్తున్నానని చెప్పింది. సినిమా అనేది గ్లామర్‌ ఫీల్డ్‌.. ఇక్కడ సీన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌లాక్‌, బికినీలు తప్పవు అని కుంటిసాకులు చెప్పేవారికి కీర్తి మాటలు కనువిప్పు కావాలి..! 

Keerthy Suresh No to Exposing:

Keerthy Suresh about Glamour Roles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ