సామాన్యంగా వేశ్యపాత్రలు చేయాలంటే క్రేజ్ ఉన్న హీరోయిన్లు భయపడిపోతారు. కానీ విద్యాబాలన్ వంటి నటి 'బేగంజాన్'తో పాటు ఇలాంటి విలక్షణమైన పాత్రలు ఎన్నో చేసి మెప్పించింది. ఇక 'వేదం' చిత్రంలో అనుష్క కూడా గొప్పగా నటించింది. ఫేడవుట్ అయిన హీరోయిన్లు మాత్రమే ఇలాంటి పాత్రలు చేస్తారనే నమ్మకం చాలా మందిలో బలంగా ఉంది. దాంతోనే సదాను వేశ్య పాత్రలో చూపించే ఓ చిత్రంలో నటించమని దర్శకుడు ఎందరో హీరోయిన్లకి కథ చెప్పినా, కథ చెప్పిన తర్వాత వారు నోచెప్పారట. దాంతో నిజంగానే ఫేడవుట్ అయిన సదా చేత పాత్రను ఒప్పించాడు దర్శకుడు. 'జయం' చిత్రంతో పరిచయమై తర్వాత 'దొంగది దొంగాడు, అపరిచితుడు, నాగ' వంటి చిత్రాలలో నటించిన సదా తన కెరీర్‌లో పెద్దగా గ్లామర్‌షో చేసింది తక్కువే.
తన సినిమాలన్నింటిలో ఆమె సంప్రదాయ బద్దంగానే కనిపించింది. బుల్లితెరపై ఓ షోకి జడ్జిగా నటించినా కూడా గ్లామర్ విషయంలో గీత దాటలేదు. 'చూస్తున్నాం బాస్.. ప్రతి సుఖానికి ఓ రేటుంటుంది ఈ లోకంలో...! కోరుకున్న సుఖం కోసం కావాల్సినంత రేటు పెట్టి కొనేస్తున్నారు ఈ లోకంలో మగాళ్లు. చివరకు పడక సుఖంతో సహా. మరి డబ్బులకి మానాన్ని అమ్ముకుంటూ ఎవరో ఊరు పేరు తెలియని వారికి పడక సుఖాన్ని అందిస్తున్న స్త్రీలందరూ ఇష్టంగానే ఆ పని చేస్తున్నారా? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు అబ్దుల్ మజిద్ అంటున్నారు. కాగా ఈచిత్రానికి 'టార్చ్‌లైట్' వంటి వేశ్య వృత్తికి ఖచ్చితంగా సరిపోయే టైటిల్‌ను దర్శకుడు పెట్టాడు.
అర్ధరాత్రుళ్లు దాటిన తర్వాత హైవేలపై లారీ డ్రైవర్లను, ఇతర విటులను వేశ్యలు ఆకట్టుకునే విధానానికి 'టార్చ్‌లైట్' అనే పదం కరెక్ట్‌గా సూటబుల్. చాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే సదా ఈ చిత్రంలో వేశ్య పాత్రను ఎలా మెప్పిస్తుందో చూడాలి...! ఇన్నేళ్ల ఆమె కెరీర్‌కి ఈ చిత్రం నిజంగానే చాలెంజ్ అని ఒప్పుకోవాలి. ఇక నేడు కోలీవుడ్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాల హవా నడుస్తోంది. కాన్సెప్ట్, కంటెంట్ బాగా ఉంటే సెన్సార్ కూడా మంచి మెసేజ్ ఉన్న చిత్రాల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడే ఈ ట్రెండ్ తెలుగులో కూడా మొదలైంది. మరి సదా చేస్తున్న ఈ ప్రయత్నం తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి...!