Advertisementt

రామ్ చరణ్ చిన్న పిల్లాడు: అనసూయ!

Tue 17th Oct 2017 02:53 PM
anasuya,ram charan,rangasthalam 1985,praises  రామ్ చరణ్ చిన్న పిల్లాడు: అనసూయ!
Anasuya About Ram Charan Dedication రామ్ చరణ్ చిన్న పిల్లాడు: అనసూయ!
Advertisement
Ads by CJ

యాంకర్ అనసూయ అటు బుల్లితెర షోస్ తో పాటు ఇటు వెండితెర సినిమాలతోను తన హవాని చూపిస్తుంది. జబర్దస్త్ షోతో పాటే పలు షోలు చేస్తున్న అనసూయ ప్రస్తుతానికి రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'రంగస్థలం 1985' లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని..... చిత్ర బృందం చెబుతుంది. అయితే రంగస్థలంలో నటిస్తున్న అనసూయ, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ సెట్స్ లో చరణ్ ఎలా ఉంటాడో.. అలాగే చరణ్ ప్రవర్తన గురించి తెగ పొగిడేస్తుంది.

రామ్ చరణ్ ఏ విషయాన్ని నేర్చుకోవడానికయినా చిన్న పిల్లాడిలా చాలా ఆసక్తి చూపిస్తారని...... అలాగే షూటింగ్ సమయంలో కూడా చిన్నపిల్లాడిలా అందరిని ఆటపట్టిచ్చేవాడని... ఇంకా చరణ్  తన ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకుంటాడని చెప్పుకొచ్చింది అనసూయ. మరి కో-స్టార్ రామ్ చరణ్ ని అనసూయ అంతలా పొగిడేసి బాగానే బిస్కెట్స్ వేస్తుందంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రంగస్థలంలో ఇప్పటికే అనసూయకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయిందట. ఆ షెడ్యూల్ పూర్తికావడంతో ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను అని కూడా చెబుతుంది అనసూయ.

Anasuya About Ram Charan Dedication:

Anasuya Praises Ram charan 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ