Advertisementt

రాజశేఖర్‌ స్వయంకృతాపరాధమే..!

Tue 17th Oct 2017 01:46 PM
rajasekhar,nene raju nene mantri,director teja,aham movie  రాజశేఖర్‌ స్వయంకృతాపరాధమే..!
Rajasekhar Missed Teja Nene Raju Nene Mantri రాజశేఖర్‌ స్వయంకృతాపరాధమే..!
Advertisement

ఒకప్పుడు యాంగ్రీయంగ్‌మేన్‌గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌, ఇమేజ్‌ ఉన్న స్టార్‌గా రాజశేఖర్‌కి మంచిస్థానం ఉండేది. ఆయనకు 'తలంబ్రాలు, ఆహుతి, అంకుశం' వంటి హిట్స్‌ ఇచ్చిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌ ఎమ్మెస్‌రెడ్డి, ఆయన కుమారుడు, మల్లెమాల అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డిలు కూడా రాజశేఖర్‌తో సినిమా తీయడం కంటే అడుక్కుతినడం మంచిదని కడుపు మండి మాట్లాడారు. ఇక ఆయనతో 'బాజీఘర్‌' చిత్రాన్ని 'వేటగాడు'గా రీమేక్‌ చేసిన సీనియర్‌ తమ్మారెడ్డి భరద్వాజ సైతం సినిమా ఫ్లాప్‌, హిట్‌లను వదిలేద్దాం.. అవి ఎవ్వరి చేతిలోలేవు. కానీ రాజశేఖర్‌తో సినిమా తీయడం కంటే బిచ్చమెత్తు కోవడం బెటరని చెప్పాడు. ఇక ఈయన సినిమాకి ఉదయం షూటింగ్‌ అయితే లంచ్‌ సమయానికి వస్తాడు.. భోజనం చేసిన తర్వాత మరలా హడావుడిగా వెళ్లిపోయి సాయంత్రం ప్యాకప్‌ చెప్పే సమయంలో వస్తాడు. ఆయనతో పెట్టుకుంటే రోజుకి ఒక్క సీన్‌ కూడా తీయలేరు.ఇక ఈయనకు ఎవరైనా 'ఆగ్రహం' కలిగిస్తే అలిగి వెళ్లిపోతాడు. 

తప్పొప్పులను పక్కనపెడితే చిరంజీవి, రాజశేఖర్‌లలో ఎవరిది తప్పు అనే విషయం పక్కనపెడితే ఆయనకు చిరంజీవితోనే కాదు... కోడిరామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు వంటి తనకు లైఫ్‌ ఇచ్చిన వారితో కూడా ఒకటే గొడవ. ఏ సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయడు. నిర్మాతలు ఇదేమని ప్రశ్నిస్తే తనకు వాగ్దాటి లేదు కాబట్టి తన భార్య జీవితను ముందుంచి నానా రచ్చ చేసి మీడియాకి ఎక్కుతాడు. ఆయనతో రాఘవేంద్రరావు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు.ఇక ఈయన సగంలోఆపేసిన చిత్రాలైతే లెక్కేలేవు. ఇక విషయానికి వస్తే మొదట దర్శకుడు తేజ తాను రానాతో హిట్‌ కొట్టి 25కోట్ల మార్కెట్‌ని సృష్టించుకున్న 'నేనే రాజు నేనేమంత్రి' చిత్రం కథని రాజశేఖర్‌కే మొదట చెప్పడం కాదు.. ఏకంగా 80శాతం షూటింగ్‌ని కూడా కోట్లు ఖర్చుపెట్టి తీశాడు. ఈ చిత్రానికి 'అహం' అనే టైటిల్‌ని కూడా పెట్టారు. కానీ సినిమా క్లైమాక్స్‌లో ఎవరి పంతాలకు,ఎవరి అహానికి వారు వెళ్లారు. తనకేదో క్రేజ్‌ ఉన్నట్లు, సినిమా క్లైమాక్స్‌లో నేను చనిపోతే నాఅభిమానులు తట్టుకోలేరని రాజశేఖర్‌, జీవిత గొడవ పడ్డారు. ఇక తేజ సంగతి అందరికి తెలిసిందే. ఆయనది కూడా ఉడుం పట్టు. కాదు..కాదు.. క్లైమాక్స్‌లో హీరో చనిపోవాల్సిందే. స్టోరీ ప్రకారం అదే అయితే కరెక్ట్‌ అని తేజ మొండికేశారు. 

దాంతో చిత్రం ఆగిపోతే, మరలా ఈ స్టోరిని తాననుకున్నట్లు ఒప్పుకుంటేనే తీస్తానని తేజ రానాకి, సురేష్‌బాబుకి చెప్పి, తాననుకున్నట్లే క్లైమాక్స్‌లో హీరోని చనిపోయేలా చూపి హిట్‌ కొట్టాడు. దాని ఫలితంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలయ్య ఎన్టీఆర్‌ బయోగ్రఫీ ఛాన్స్‌ కొట్టేయగా,రాజశేఖర్‌ తన 'అహం' తెచ్చిన ముప్పుని చూసి ఉసూరుమంటున్నాడు. అంతేకాదు.. ఆయన వర్మ దర్శకత్వంలో 'పట్టపగలు' అనే చిత్రంలో టీనేజ్‌ అమ్మాయికి తండ్రిగా నటించి తర్వాత తన ఇమేజ్‌కి సెట్‌ కాదని సినిమా విడుదలను ఆపేశాడు.ఇక తనతో సినిమా తీయడమే కష్టమైతే 'పీఎస్వీగరుడవేగ' చిత్రాన్ని 25కోట్లతో తీస్తున్న ప్రవీణ్‌సత్తార్‌ని అసలు నా ఇమేజ్‌కి ఇతను సరితూగగలడా? తన ఇమేజ్‌కి తగ్గట్లు తనని చూపించగలడా?  అని అనుమానం వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి తానే చెప్పుకుని మురిసిపోయాడు.. ఈ అల్లరి ప్రియుడు.. మగాడు..! 

Rajasekhar Missed Teja Nene Raju Nene Mantri :

Rajasekhar Bad Luck Again Revealed

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement