'ఏమాయచేసావో' లో ఎవరు ఎవరిని మాయ చేసారో గానీ అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ వివాహం ద్వారా ఈమధ్య కాలంలో టాలీవుడ్ యంగ్‌కపుల్‌గా చరిత్రలో నిలిచిపోయారు. ఇక వీరి వివాహం గోవాలో ఈనెల 6న హిందు సంప్రదాయం ప్రకారం,7 వ తేదీన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహంను ఎవ్వరు వీడియో తీయవద్దని, తామే వీడియో తీసి అందిస్తామని పెళ్లికి హాజరైన గెస్ట్‌లకు సమంత రిక్వెస్ట్‌తో కూడిన కండీషన్‌ను పెట్టడం, అందరూ దానిని తూచ తప్పకుండా ఫాలో అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ పెళ్లికి గంటల ముందు నుంచే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం సమంత, మామగారైన నాగార్జునలు అందిస్తూనే ఉన్నారు.
తాజాగా క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన పెళ్లి సందర్భంగా సమంత చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహం సందర్బంగా సమంత మాట్లాడుతూ... నాగచైతన్యను ఉద్దేశించి 'నీ రాకతోనే నా జీవితానికి పరిపూర్ణత లభించింది. నా జీవితంలో నేను చూసిన అద్భుత చిరునవ్వు నీదే. నాకు మరో వంద అవకాశాలొచ్చినా... మరో వంద జన్మలెత్తినా నా భర్తగా నిన్నే కోరుకుంటా...మన పిల్లలకు మంచి తండ్రివి అవుతావు' అని ఆ రోజున సమంత భావోద్వేగంతో మాట్లాడింది. తాజాగా సమంత మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్నది ఎవరంటే అది నేనే అంది.
నాకు అక్కినేని కోడలు కావడం ఎంతో గర్వంగా ఉంది. నన్ను అర్ధం చేసుకున్న భర్త దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది? అందునా ఆ ఇష్టాలను అక్కినేని ఫ్యామిలీ వారు ఎంతో ఇష్టపడుతున్నారు. పెళ్లయిన తర్వాత కూడా నేను నాలాగే ఉండే అవకాశం లభించింది. సాధారణంగా హీరోయిన్లు కెరీర్‌లో మంచిఫామ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదనే నమ్మకం చాలా మందిలో ఉంది. దానిని నేను బ్రేక్ చేస్తాను. పెళ్లి తర్వాత కూడా నాకు నచ్చిన చిత్రాలలో నటిస్తాను. దీనికి నా ఫ్యామిలీ (అక్కినేని) సపోర్ట్‌గా ఉంది. ఇక వివాహం ప్లానింగ్ అంతా చైతూదే. ఇలా రెండు సార్లు పెళ్లి చేసుకుంటానని అసలు ఊహించలేదు. కానీ 'ఏమాయ చేశావే' తరహాలో రెండుసార్లు పెళ్లి చేసుకోవడం అనేది దేవుడి నిర్ణయమని సంతోషంగా చెప్పుకొచ్చింది.
Click Here to See The Samantha and Naga Chaitanya Marriage Video