Advertisementt

'కర్ణ' వద్దు బాబోయ్?

Mon 16th Oct 2017 05:27 PM
balakrishna,karna,balakrishna fans,jayasimha,nbk102  'కర్ణ' వద్దు బాబోయ్?
Fans Unhappy with Balakrishna Karna Title 'కర్ణ' వద్దు బాబోయ్?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ హీరోగా పూరి దర్శకత్వంలో పైసా వసూల్ చిత్ర టైటిల్ ని ప్రకటించినప్పుడు ఇదేం టైటిల్.. బాలయ్యకి అస్సలు సూట్ కాదంటూ నందమూరి అభిమానులు పెదవి విరిచారు. అయినా పైసా వసూల్ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదల సమయానికి బాలకృష్ణ పైసా వసూల్ టైటిల్ అభిమానులకు ఎక్కేసి మంచి క్రేజ్ సంపాదించింది. ఇక సినిమా ఫలితం అనేది ప్రేక్షకుల నాడి మీద ఆధారపడివుంటుంది అది వేరే విషయం. అయితే ఇప్పుడు కూడా బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రానికి 'కర్ణ' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

అయితే ఈ కర్ణ టైటిల్ బాలకృష్ణ కి సూట్ కాదని... నందమూరి అభిమానులు నిరాశను వ్యక్తం చేసినట్లుగా ప్రచారంలో ఉంది. 'కర్ణ' అనే టైటిల్ చప్పగా ఉందని... సింహ సెంటిమెంట్ తో వచ్చిన టైటిల్స్ తో బాలయ్య హిట్స్ కొడుతున్నాడని... అందుకే రవికుమార్ - బాలయ్య చిత్రానికి ముందు అనుకున్నట్టుగా 'జయసింహ' అనే టైటిల్ నే ఫిక్స్ చెయ్యమని... బాలయ్య బాబుని బతిమలాడుతున్నారట. మరి 'కర్ణ' అనే టైటిల్ కన్నా 'జయసింహ' టైటిలే బావుందని చాలామంది చెప్పడంతో బాలకృష్ణతో పాటు దర్శకుడు రవికుమార్ కూడా 'కర్ణ' టైటిల్ మీద వెనక్కి తగ్గే సూచనలు ఉన్నాయంటున్నారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషీ, హరిప్రియలు ఈ సినిమాలో నటిస్తున్నారు. సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Fans Unhappy with Balakrishna Karna Title:

Balakrishna Fans Wants Jayasimha for his 102 movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ