సమంత - నాగ చైతన్య పెళ్లి గోవాలో అక్కినేని కుటుంబం, దగ్గుబాటి, సమంత కుటుంబం సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన వారానికే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. నాగార్జున, సమంత ల తాజా చిత్రం రాజుగారి గది2 ప్రమోషన్స్ తో బిజీగా వున్నారు. మరోపక్క సమంత మహానటి షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది. అయితే చై - సామ్ ల పెళ్లి తర్వాత నాగార్జున ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న ఒక షోకి హాజరయ్యాడు. ఆ షోలో యాంకర్.... సమంత - చైతన్య ప్రేమ మీకు ఎలా తెలిసింది అని, సమంత మీకు ఎంత నచ్చింది... సమంత గురించిన మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా..
దానికి నాగార్జున మనం సినిమా అప్పుడు సమంత నాతో ఎప్పుడు మాట్లాడినా అందులో ఎక్కువ విషయాలు చైతు గురించే ఉండేవి. కానీ నాకు అప్పుడు మైండ్ లో బల్బ్ వెలిగేది కాదు. మా ఫ్యామిలీ గురించిన మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఐనో...ఐనో అంటూ సమంత సమాధానం విన్నప్పుడు కూడా నాకు చైతు తో సామ్ లవ్ లో ఉన్నది అనే విషయమే అర్ధమే కాలేదని చెబుతూ నవ్వేశాడు. ఇక సమంత చాలా మంచి అమ్మాయని.. ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయసహకారాలు అందిస్తుందని.. అలాగే సమంత చాలా ఎక్కువగా మాట్లాడేస్తుందని.. పాపం చైతు కామ్ గా ఉంటాడు... కానీ సామ్ మాత్రం నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుందని.. పాపం చైతు అంటూ నవ్వేశాడు.
ఇక సమంత తమ కుటుంబంలోకి అడుగుపెట్టి.. తమని సంతోష పెట్టిందని చెప్పాడు నాగ్. అలాగే ఆ షో యాంకర్ మీ ఫోన్ లో చైతన్య, సమంత ల ఫోన్ నెంబర్లకి పేర్లు ఏమని పెట్టారని నాగ్ ని అడగగా.. చైతన్య అక్కినేని అని.. సమంత అని చెప్పగానే.... అదేమిటి మీరు సమంత ఫోన్ నెంబర్ కి కోడలు అని పెట్టుకుంటారని అనుకున్నానని.. ఆ యాంకర్ అడగగా.. ఎందుకు సమంత అనే అంత స్వీట్ నేమ్ ఉండగా అంటూ గల గల నవ్వేశాడు నాగ్. ఇక నాగ్ మామగా సమంత కోడలిగా ఎలా కలిసిపోయారో చైతు - సామ్ ల పెళ్ళిలో బయటికి వచ్చిన ఫొటోస్ లో స్పష్టంగా అర్ధమయ్యింది.