కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి... ఆ తర్వాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. నిర్మాతగా కూడా బడా సినిమాలు నిర్మించే నిర్మాతగా మారి అందరికి షాక్ ఇచ్చాడు. గణేష్ ఒక్కసారిగా నిర్మాత అవతారం ఎత్తడం.... బడా హీరోల సినిమాలు నిర్మించడం వంటి విషయాలతో అప్పట్లో బ్లాక్ బస్టర్ గణేష్ అయ్యాడు. ఇక బడా హీరోలంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో చిత్రాలు నిర్మించి ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసిన గణేష్ మళ్ళీ ఏ హీరోతో ఇప్పటివరకు సినిమాని నిర్మించలేకపోయాడు. కారణం గణేష్ బండ్లకి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదనే చెప్పాలి.
రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత బండ్ల గణేష్ ఇప్పుడొక సినిమాని నిర్మించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ మధ్యన టు కంట్రీస్ సినిమాని రీమేక్ చేస్తున్నాడని ప్రచారం జరిగినప్పటికీ గణేష్ ఆ సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు తాజాగా బండ్ల హీరో రవితేజ సినిమాని నిర్మించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. రవితేజ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా చేశాడు. ఆ సినిమా విడుదలకు రెడీగా ఉండగా.. రవితేజ మరో సినిమా టచ్ చేసి చూడు సినిమా కూడా సెట్స్ మీదుంది. మరి ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ బ్యానర్ లో కూడా నటించడానికి రవితేజ కూడా సానుకూలంగా వున్నాడని... ఇప్పటికే కథ చర్చలు ప్రారంభమైనట్టుగా చెబుతున్నారు.
మరి రవితేజ... గణేష్ సినిమా ఒప్పుకున్నప్పటికీ ముందు టచ్ చేసి చూడు పూర్తి చెయ్యాలి. అలాగే తమిళ భోగాన్ రీమేక్ లో నటించాలి. ఆతర్వాతే బండ్ల నిర్మాణంలో రవితేజ నటించేది. చూద్దాం రవితేజతో మళ్ళీ నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చెయ్యాలని ఆశపడుతున్న బండ్ల గణేష్ కోరిక ఏ మాత్రం నెరవేరుతుందో అనేది.