Advertisementt

సమంత కలలోకి వస్తుందని భయమట!

Sun 15th Oct 2017 11:10 PM
nagarjuna,samantha,raju gari gadhi 2,fans comments  సమంత కలలోకి వస్తుందని భయమట!
Fan Sensational Comments on Samantha సమంత కలలోకి వస్తుందని భయమట!
Advertisement
Ads by CJ

సమంత అక్కినేని కోడలు అయిన తర్వాత విడుదలైన మొదటి చిత్రం 'రాజుగారి గది 2'. ఇందులో ఆత్మ పాత్రను సమంత చాలా బాగా పోషించింది. మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం మరీ గొప్పగా లేకున్నా బాగా ఆకట్టుకుంటోంది. ఇక క్లైమాక్స్‌లో సమంత నటనను చూసి థియేటర్లలోని ప్రేక్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక నాడు విజయశాంతి ప్రధాన పాత్రలో రామోజీరావు నిర్మాతగా టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'ప్రతిఘటన' చిత్రంలో రౌడీ లేడీ లెక్చరర్‌ అయిన విజయశాంతిని నడిరోడ్డులో నగ్నంగా నిలబెడతాడు. 

ఆ సీన్‌ని నెగటివ్‌ ఫిల్మ్‌లో చూపించినా అది నాడు సంచలనం అయింది. ఇక 'రాజుగారిగది 2'లో బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా, తనకు తెలియకుండా వీడియో తీసి బయటపెట్టడంతో ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. నగ్నంగా స్నానం చేసిన సీన్‌లో సమంత నటించకపోయినా, ఆ సీన్‌ని బ్లర్‌ చేసినా కూడా నిజమేనని ఫీల్‌తెచ్చిన ఘనత సమంతకి దక్కుతుంది. ఓ పెద్దింటి కోడలు కాబోతున్న సమంతకు నాడు నాగచైతన్య, నాగ్‌లు ఈ పాత్రను చేయమని చెప్పడం గ్రేటే. 

ఇక ఈ చిత్రం చూసిన ఓ అభిమాని సమంతను ఉద్దేశించి, సమంత..నీవు నిన్నటిదాకా స్వప్న సుందరివి. నీవు కలలోకి రావాలని అందరూ కోరుకునే వారు. కానీ ఈ చిత్రంలోని ఆత్మని చూసిన తర్వాత నువ్వు కలలోకి రాకూడదని వేడుకుంటున్నారు.. అని చమత్కరించడంతో సమంత నవ్వుతున్న ఇమోజీలను పెట్టింది.ఇక నాగార్జున మాట్లాడుతూ, కనీసం ఈ చిత్రం ట్రైలర్‌ చూడటానికి కూడా నాగచైతన్య, అఖిల్‌లు భయపడ్డారు. థియేటర్‌ తలుపులన్నీ తీసి, లైట్లు వేస్తేనే ఈ చిత్రం చూస్తామన్నారని తెలిపాడు. 

Fan Sensational Comments on Samantha:

Funny Conversation Between Samantha and Her Fan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ