Advertisementt

మిస్టర్ సి తో బ్రాట్: ఉపాసన

Sun 15th Oct 2017 08:00 PM
ram charan,upasana,mr c and brat  మిస్టర్ సి తో బ్రాట్: ఉపాసన
Upasana posted Mr C and Brat Photo మిస్టర్ సి తో బ్రాట్: ఉపాసన
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కి పెంపుడు జంతువులు అంటే ఎంతిష్టమో తరచూ చూస్తూనే ఉంటాం.... అలాగే వింటూనే ఉంటాం. తన ఫామ్ హౌస్ దగ్గర రామ్ చరణ్ అనేక రకాల పెంపుడు జంతువులను పెంచుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. గుర్రాల దగ్గరనుండి, నెమళ్ళు, కుక్కపిల్లలు ఇలా చరణ్ పెంపుడు జంతువుల లిస్ట్ చాలానే ఉంది. ఇక సినిమా షూటింగ్స్ తోను, ఇతర వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పుడు వాటి సంరక్షణ చరణ్ వైఫ్ ఉపాసన తీసుకుంటుంది. ఇక ఉపాసన కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ తన మిస్టర్ సి చేసే పనులను ఎప్పటికప్పుడు మెగా అభిమానులకు అందిస్తుంటుంది. 

 రామ్ చరణ్ భార్య ఉపాసన భర్త  చేసే పనులని... అలాగే అతనికి సంబందించిన విశేషాలను ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్యన పెంపుడు కోడి పుంజుతో చరణ్ అంటూ ఒక పిక్ ని పోస్ట్ చేసిన ఉపాసన ఇప్పుడు  తాజగా మరో అందమైన ఫోటోని  పోస్ట్ చేసింది. రామ్ చరణ్ సోఫాలో కూర్చుని ఉండగా అతడి ఒడిలో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల (బ్రాట్) ఒకటి ఠీవీగా కూర్చుని ఉంది. లవ్ ఆఫ్ మై లైఫ్ అనే హ్యాష్ టాగ్ తో ఉపాసన ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ పిక్ లో రామ్ చరణ్ గుబురు గెడ్డంతో ఒడిలో పెంపుడు కుక్క బ్రాట్ తో అందమైన ఫోటోకి ఫోజులిచ్చాడు. 

ఇక చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకూండా తన తండ్రి సై రా నరసింహారెడ్డి సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా తలమునకలై ఉన్నాడు.

Upasana posted Mr C and Brat Photo:

Upasana Update on Ram Charan in his social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ