'నరసింహ'లో నీలాంబరిగా పవర్‌ఫుల్ పాత్రను పోషించిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌ని మలుపుతిప్పిన చిత్రంగా 'బాహుబలి'ని చెప్పవచ్చు. ఇందులో రాజమాత 'శివగామి' పాత్రలో రమ్యకృష్ణ హుందాతనం, ఠీవి, ఆమె చూపిన నటనా ప్రతిభ చూసిన వారు ఆ పాత్రకు శ్రీదేవిని పెట్టుకోకుండా రమ్యకృష్ణను పెట్టుకుని మంచి పనిచేశారని, రమ్యకృష్ణ స్థాయిలో శ్రీదేవి కూడా నటించి ఉండేది కాదని అంటున్నారు. ఇది నిజమే. ఇక విషయానికి వస్తే ఇప్పటికే పరిటాల రవి జీవతగాధగా రాంగోపాల్‌వర్మ 'రక్తచరిత్ర'ను తీశాడు.
ఈచిత్రం తొలి పార్ట్ అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు పరిటాల రవి కథను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథగా నారారోహిత్ 'బాలకృష్ణుడు'ని తీస్తున్నారు అనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఇందులో పరిటాల రవి భార్య, ఏపీ మంత్రి పరిటాల సునీత పాత్రను రమ్యకృష్ణ పోషిస్తోందని అంటున్నారు. అదే నిజమైతే పరిటాల సునీతగా రమ్యకృష్ణ అదరగొట్టేలా నటిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విడుదలకు సిద్దమవుతున్న ఈచిత్రం టైటిల్‌ని చూస్తే ఇది ఆ తరహా చిత్రమని కనీసం ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరి ఇదే నిజమైతే పరిటాల రవిగా ఎవరు నటిస్తారో వేచిచూడాల్సివుంది...!