Advertisementt

భారతీయుడుపై మరో నిర్మాత కన్ను!

Sun 15th Oct 2017 03:35 PM
am ratnam,dil raju,bharateeyudu 2  భారతీయుడుపై మరో నిర్మాత కన్ను!
AM Ratnam Eye on Bharateeyudu 2 భారతీయుడుపై మరో నిర్మాత కన్ను!
Advertisement
Ads by CJ

కమల హాసన్ - శంకర్ కలయికలో ఇండియన్ 2  తీస్తున్నానంటూ అధికారికంగా ప్రకటించి దక్షిణాది ప్రేక్షకుల చూపంతా.. ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ వేదిక మీద దర్శకుడు శంకర్ తో కలిసి అట్టహాసంగా ఇండియన్ 2  సినిమాని ప్రకటించాడు దిల్ రాజు. అయితే ఈ సినిమాకి 200  కోట్ల భారీ బడ్జెట్ ని దిల్ రాజు పెడుతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. మరి ఒకేసారి 200  కోట్ల బడ్జెట్ అంటే దిల్ రాజు మామూలు ఫెమస్ అవ్వలేదు. ఇప్పటివరకు ఎంతో కాలిక్యులేటెడ్ గా సినిమాలు తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా 200  కోట్ల పెట్టుబడి పెట్టడం ఏమిటా అని చాలామంది చాలా రకాలుగా అనుమానపడుతున్నారు.

ఇంతలో దిల్ రాజు నిర్మాణంలో ఇండియన్ 2  ఆగిపోయిందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా సాక్షిగా గుప్పుమన్నాయి. అయితే వెంటనే తేరుకున్న దిల్ రాజు.. లేదు లేదు ఇండియన్ 2 ఆగలేదు. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది... ఒకవేళ ఆగిపోతే నేనే చెప్తా దానిలో మొహమాటం లేదంటున్నాడట. మరి ఇదంతా ఇలా ఉండగా మరో నిర్మాత ఎ.ఎమ్ రత్నం ఈ ఇండియన్ 2  ప్రాజెక్టులో తనను కూడా పార్టనర్ ను చేయమని దిల్ రాజు ను బాగా మొహమాట పెడుతున్నట్లుగా ప్రచారం మొదలైంది. ఆయనకున్న ఆర్థిక సమస్యలను ఈ ప్రాజెక్ట్ ద్వారా తీర్చుకోవాలని...అనుకుంటున్నాడట. మరి భారతీయుడు సినిమాని నిర్మించిన ఎ.ఎమ్ రత్నం ఆ సినిమాతో భారీ లాభాలు జేబులో వేసుకున్నాడు.

ఇక ఇండియన్ 2  లో కూడా ఉంటె గనక తనకి మరింత క్రేజ్ వస్తుందని అనుకుని దిల్ రాజుని అడగడంతో రాజుగారు  ఊ అనిగాని ఉహు అనిగాని చెప్పడం లేదట. అలాగే ఈ సినిమా దర్శకుడు శంకర్ ఎలా చెబితే అలానే అన్నట్లుగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడని టాక్. 

AM Ratnam Eye on Bharateeyudu 2:

AM Ratnam Wants Partenership with Dil Raju in Bharateeyudu 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ