Advertisementt

రానాది మరొకటి రెడీ..!

Sun 15th Oct 2017 11:57 AM
daggubati rana,director sathyasiva,1945 movie  రానాది మరొకటి రెడీ..!
Rana Next Movie is 1945 రానాది మరొకటి రెడీ..!
Advertisement
Ads by CJ

నేటియంగ్‌ హీరోలు రొటీన్‌ కథల వైపు కాకుండా వైవిధ్యభరితమైన కథల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇందులో దగ్గుబాటి రానా ముందుంటున్నాడు. ఆయన ప్రస్తుతం వరుస విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ఏడాది 'ఘాజీ', 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌', 'నేనే రాజు నేనేమంత్రి' అనే మూడు చిత్రాలను విడుదల చేసి మంచి క్రేజ్‌తో పాటు కమర్షియల్‌ సక్సెస్‌ని కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేస్తున్నాడు. సత్యశివ దర్శకత్వంలో కె ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రెజీనా-లీషా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌-నాజర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

ఇది 1945 కాలం నాటి బ్రిటిష్‌ ఇండియా నేపద్యంలో సాగే పీరియాడికల్‌ మూవీ కావడం విశేషం, రానా ఇందులో సుభాష్‌చంద్రబోస్‌ ఆర్మీలోని జవాన్‌పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తయింది. తాజాగా అత్యంత కీలకమైన రెండోషెడ్యూల్‌ ప్రారంభమైందని, తాను 1945 కాలం నాటి సైనికుడి తరహాలో హెయిర్‌స్టైల్‌ని మార్చుకుంటున్నట్లు రానా తెలిపాడు. మా టీమ్‌ సభ్యులు విజయ్‌, జైపాల్‌ నా గెటప్పును మారుస్తున్నారని రానా సోషల్‌మీడియాలో తెలిపాడు. ఇక ఈ చిత్రానికి తమిళంలో 'మదై తీరంతు' అనే టైటిల్‌ను పెట్టారు. తెలుగులో '1945' అనే టైటిల్‌ని నిర్ణయించారు. వేగంగా షూటింగ్‌ జరిపి ఈ ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Rana Next Movie is 1945:

Rana Next Movie 1945 Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ