మహేష్ బాబు నటించిన స్పైడర్ కథ ముగిసింది. స్పైడర్ ఫైనల్ గా డిజాస్టర్ అయ్యింది. ఇక మహేష్ తన తదుపరి చిత్రం పైన ఫోకస్ పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కోసం ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టి అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ అసెంబ్లీ సెట్ వేశారు. ఇప్పటివరకు ఆ సెట్ లోనే సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాడు కొరటాల. ఇక స్పైడర్ తర్వాత టూర్ కి వెళ్లిన మహేష్ టూర్ ముగించుకుని 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ బాబు భరత్ అనే నేను కోసం మరో సెట్ కూడా రెడీ అవుతోంది.
అయితే ఈ భారీ సెట్ ని కూడా భరత్ అనే నేను చిత్ర బృందం అన్నపూర్ణ స్టుడియోస్ లోనే సిద్ధం చేస్తున్నారట. గత 2 రోజుల నుంచి కడుతున్న ఈ సెట్.. సినిమాకు చాలా కీలకం అంటున్నారు. భరత్ అనే నేను సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశం కోసం ఈ సెట్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల16 నుండి మహేష్ భరత్ అనే నేను సెట్స్ పైకి వస్తాడని తెలుస్తోంది. మరోపక్క ఇంకొన్ని రోజులు మహేష్ గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. మహేష్ నటించిన స్పైడర్ సినిమా ఫ్లాప్ అవడంతో.... ఇలా ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి లాంగ్ గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాడు మహేష్.
మరి ఎప్పటిలాగే మహేష్ ఈసారి కూడా స్పైడర్ దెబ్బకి కనీసం 2 నెలలు గ్యాప్ తీసుకుంటాడనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ మధ్యన ఎంతో కమిట్మెంట్ తో సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్న మహేష్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన సినిమా కోసం అంత గ్యాప్ తీసుకోకపోవచ్చనే వాదన కూడా వినబడుతుంది. చూద్దాం మహేష్ ఫైనల్ గా భరత్ అనే నేను సెట్స్ మీదకి ఎప్పుడు వెళతాడా అనేది.