జీనియస్ సినిమాతో దర్శకుడిగా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓం కార్ ఆ సినిమా ప్లాప్ తో.. మరొక సినిమా చెయ్యడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా పెట్టి రాజుగారి గదిని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఆ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా.... ఈ సినిమాలో అదిరిపోయే కామెడీ ఉండడంతో భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక హార్రర్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు మొహం మొత్తడం మొదలయ్యాక చిన్న స్టార్స్ తో సినిమా తీస్తే లాభం లేదని గుర్తించిన ఓం కార్ ఏకంగా సీనియర్ హీరో నాగార్జునని... టాప్ హీరోయిన్ సమంతని ఒప్పించి మరీ ఓంకార్ రాజుగారి గది 2 ని తెరకెక్కించాడు.
మరి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఓం కార్ ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ సాధించేసాడు. రాజుగారి గది 2 సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. నాగార్జున, సమంత లతో ఓం కార్ మంచి హిట్ కొట్టేసాడనే టాక్ బయలుదేరింది. మరి ఓం కార్ నెక్స్ట్ సినిమా ఏంటంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఈ సినిమా హిట్ తో ఇప్పుడు ఓం కార్... మెగా ఫ్యామిలీ హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడని... ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్నాడని... ఈ సినిమాతో తన ట్యాలెంట్ ని మరింతగా చూపించడానికి ఓం కార్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.
మరి రామ్ చరణ్ కూడా యంగ్ డైరెక్టర్స్ ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాడు. అందుకే చరణ్ ఇప్పుడు ఓం కార్ ని కలిసి స్టోరీ డిస్కర్షన్ కి కూడా ఒకే చెప్పసాడనే టాక్ వినబడుతుంది. మరి రాజుగారి గది 2 సినిమా అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ.. భారీగా పెట్టిన బడ్జెట్ తెస్తుందా అనే అనుమానంలో చాలామందే ఉన్నారు. నాగార్జున, సమంత ల ఎంట్రీతో ఈ సినిమాకి భారీగానే బడ్జెట్ ఎక్కింది. దాదాపు ఈ సినిమాకి 25 కోట్లు బడ్జెట్ ఎక్కినట్టుగా సమాచారం. మరి సినిమా గనక పెట్టిన బడ్జెట్ తెచ్చేసి.. లాభాల పంట పండిస్తే మాత్రం ఖచ్చితంగా ఓం కార్ కి రామ్ చరణ్ అవకాశమిస్తాడంటున్నారు.