నేటి జనరేషన్‌కి తెలియకపోయినా శరత్‌బాబు అంటే తెలుగులో ఒకప్పుడు బిజీ బిజీ ఆర్టిస్ట్. తెలుగు, తమిళం,కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో ఆయన ఎంతో బిజీగా ఉండేవారు. ఇక ఆయనకు నాడే పెద్ద ప్లేబోయ్‌గా పేరుంది. మంచి అందగాడు కావడంతో ఆయనను అందరూ బాగా ఇష్టపడేవారు. ఇక తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయన అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే సమయంలో అప్పటికే వ్యాంప్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, లేడీ కమెడియన్‌గా స్టార్ హోదాలో ఉన్న రమాప్రభపై ఆయన కన్ను పడింది. తనకంటే పెద్దదైన రమాప్రభను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఉన్న ఇండస్ట్రీలోని పరిచయాలను ఉపయోగించుకుని బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు.
ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. రమాప్రభ నాడు మీడియా ముందుకొచ్చి తన మీద ప్రేమతో ఆయన తనను చేసుకోలేదని, తన స్టార్‌స్టేటస్‌తో పాటు తన సంపాదనను చూసి వివాహం చేసుకుని నమ్మించి తనను బికారిని, ఒంటరిని చేశాడని ఏడ్చేసింది. మరోవైపు శరత్‌బాబు మాత్రం రమాప్రభనే తనను మోసం చేసిందని, తనకంటే వయసులో పెద్ద అయినా కూడా ఆమె తనకు అబద్దం చెప్పిందని, ఆమెకు అంతకు ముందే మరో వ్యక్తితో వివాహమైన విషయాన్ని దాచిందని చెప్పుకొచ్చాడు. ఇక రమాప్రభ వయసు మీద పడి, అవకాశాలు లేక ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతోంది. శరత్‌బాబు మాత్రం ముందు జాగ్రత్తగా బాగానే వెనకేసుకున్నాడని వారిని తెలిసిన వారు చెబుతారు. ఇక ఆ మద్య ఓ వెబ్‌ఛానెల్‌లో శరత్‌బాబు మాట్లాడుతూ, తాను తాజాగా ఓమహిళను వివాహం చేసుకున్నానని చెప్పాడు. ఆమెపేరు చెప్పమంటే ఇప్పుడు కాదు.. ప్రస్తుతానికి ఆమె పేరును 'మిసెస్‌శరత్‌బాబు' అని పిలుచుకోమని చెప్పాడు. ఇక తాజాగా తెలుగు, తమిళ సీనియర్ హాట్ లేడీ నమితను ఆయన వివాహం చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటి పుకార్లు మామూలే. రావణాసురుడు సీతని ఎత్తుకుపోతే అది పెద్దగా న్యూస్ కాదు. ఎందుకంటే రావణాసరుడు అలాంటి వాడని అందరికీ తెలుసు. అదే రాముడు శూర్పణకని ఎత్తుకుని వెళ్తే అదే పెద్ద న్యూస్ అవుతుంది. ఎందుకంటే రాముడికి క్లీన్ ఇమేజ్ ఉంది.
కాబట్టి నాలాంటి క్లీన్‌ఇమేజ్ ఉన్నవారి మీద ఇలాంటి పుకార్లు వస్తే జనాలు బాగా ఆకర్షితులవుతారు. ఆ వార్త రాసింది ఎవరైనా నా వల్ల వాళ్లకు, వారి భార్యాపిల్లలకు డబ్బులు వస్తే నా ద్వారా వారికి సహాయం అందినందుకు సంతోషిస్తా.. అసలు నమితతో ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట ఓ తమిళ చిత్రం చేశాను. పేరు కూడా గుర్తులేదు. ఎంతైనా సెలబ్రిటీలు గొప్పవారు. నలుగురికి ఇలాంటి వార్తల ద్వారా సంతోషాన్ని పంచుతారని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. తనకు తాను తనకు రాముడు వంటి క్లీన్‌ఇమేజ్ ఉందని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదం. ఇక ఇలాంటి వార్తలు రాస్తే ఆయన చెప్పినట్లు రాసిన వారికి ఎంతో చిన్నమొత్తం లభిస్తుంది. కానీ ఎప్పుడో కనుమరుగైన శరత్‌బాబు వంటివారు వార్తల్లో నిలిస్తే లక్షలు, కోట్లు ఖర్చుపెట్టినా రాని గుర్తింపు వస్తుంది. ఇది శరత్‌బాబుకి తెలియంది కాదు...!