Advertisementt

అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్..!

Sat 14th Oct 2017 02:08 PM
samantha,naga chaitanya,samantha parents,nagarjuna,amala,akhil  అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్..!
Samantha with Her Parents in Marriage అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్, కోలీవుడ్ సినిమా అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టాప్ మోస్ట్ హీరోయిన్ సమంత అనుకున్నట్టే తన స్నేహితుడు నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే నాగ్ చైతన్యతో ప్రేమాయణం నడపడమే కాదు ఆ పెళ్ళికి ఇరు కుటంబాలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. నాగ చైతన్య కూడా హీరో కావడం.. పెళ్లి తర్వాత సమంత కి సినిమాల్లో నటించడానికి అభ్యంతరాలు ఏం లేవని అక్కినేని ఫ్యామిలీ కూడా సమంతకి భరోసానివ్వడంతో ఈ పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. అయితే సమంత - చైతన్య పెళ్లి అనుకున్నప్పటి నుండి అక్కినేని, దుగ్గుబాటి కుటుంబాల వారే హైలెట్ అయ్యారు గాని సమంత తరుపు ఆమె తల్లి తండ్రులు గాని ఆమె బంధువులు గాని ఎక్కడా కనిపించలేదు. ఇక సమంత పెళ్లి కి ముందు ఆమె తల్లికి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉందనే ప్రచారం జరిగింది.

కానీ సమంత - చైతూల పెళ్లి అనుకున్న టైం కి జరిగిపోయింది. ఇక ఈ పెళ్లిలోను నాగ్ తల్లితండ్రులు నాగార్జున, అమల, అఖిల్. నాగ చైతన్య తల్లి లక్ష్మి వంటివారు కనబడ్డారు గానీ సామ్ తల్లితండ్రులు ఎక్కడా కనబడకపోయేసరికి అందరిలో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్న ఈ దంపతులతో పాటు నాగ్ ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటోలు మాత్రమే బయటికి రావడం, సామ్ తరుపు బంధువులు ఫొటోస్ ఒక్కటి బయటికి రాకపోవడంతో ఈ అనుమానాలు రెట్టింపయ్యాయి. హిందూ వివాహంలో వారు కనబడకపోయినా కనీసం క్రిష్టియన్ పెళ్ళిలో అయినా వారు కనబడతారు అనుకున్నారు అంతా. కానీ అక్కడా కనబడలేదు.

అయితే పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాతట సమంత, నాగ చైతన్య  దంపతులతో పాటే నాగార్జున  అమల దంపతులు, సమంత తల్లి తండ్రుల దంపతుల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడంతో అందరి అనుమానాలు పటా పంచలైపోయాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఇరు కుటుంబాలు హ్యాపీగా ఒక ఫొటోకు ఫోజులిచ్చారు. మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Samantha with Her Parents in Marriage:

Naga Chaitanya and Samantha's wedding ceremony has been the most memorable affair for Akkineni and Samantha's families.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ