సమంత మొహం 1000 క్యాండిల్ బల్బు మాదిరిగా!

Samantha About Raju Gari Gadhi 2!

పెళ్లి జరిగిన ఐదో రోజునే సినిమాల మీదనున్న కమిట్మెంట్స్ తో సమంత రాజుగారి ప్రమోషన్స్ కోసం వాలిపోయింది. గోవాలో 6 , 7  తేదీల్లో సింపుల్ అని చెబుతున్న నాగ చైతన్య - సమంతల డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లో సమంత - నాగ చైతన్యలు వెలిగిపోతూ కనిపించడమే కాదు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఈ వేడుకని నిర్వహించారు. అయితే సమంత పెళ్లి తర్వాత హాని మూన్ అవి ఇవి అంటూ టైం వెస్టు చెయ్యకుండా తాను కమిట్ అయిన సినిమాలకు న్యాయం చెయ్యాలని... ఒక పక్క రాజుగారి గది 2  సినిమా విడుదల సందర్భంగా జరుగుతున్న ప్రమోషనల్ ఈవెంట్స్ లో సందడి చేసింది. ఛానల్స్ కి  ఇంటర్వ్యూలతోపాటు రాజు గారి గది రిలీజ్ ప్రెస్ మీట్ లోను హుషారుగా పాల్గొంది.

ఇక ఆ ఈవెంట్ లో సమంత మొహం 1000  క్యాండిల్ బల్బు మాదిరిగా వెలిగిపోతూ కనిపించింది. పెళ్లి తర్వాత సమంత మోహంలో కొత్త కాంతి స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇక మీడియా చూపు అంతా సమంత మీద. అక్కినేని ఇంటికోడలిగా అడుగుపెట్టిన సమంత మొదటిసారి మీడియా ముందుకు రావడం... అది కూడా మామగారు నాగార్జున తో కలిసి ఎంతో పద్దతిగా దర్శనమివ్వడం మాత్రం చూపురలను ఆకర్షించింది. ఇక అక్కినేని కోడలిగా తన బాధ్యతలు మరింత పెరిగాయని... వాటిని తాను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పడమే కాదు రాజుగారి గది సినిమా గురించి కూడా గొప్పగా చెప్పేసింది.

అయితే సమంత మాత్రం ఉన్నట్టుండి తాను గతంలో చేసిన ఎన్నో సినిమాలు... అసలు ఎందుకు చేసానో కూడా అర్థం కాని పాత్రలు చేశానని... కాని రాజు గారి గది 2 లో చేసింది మాత్రం చాలా చాలా స్పెషల్ పాత్ర అంటూ ఆకాశానికి ఎత్తేసింది. మరి నిజంగా రాజుగారి గది లో సమంత పాత్ర ఎంత స్పెషల్ అయినా అవ్వొచ్చు గాని ఇలా ఆ సినిమాని ఆకాశానికెత్తేస్తూ ఇదివరలో నటించిన సినిమాలను చిన్న చూపు చూస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదనే కామెంట్స్ పడుతున్నాయి. అయినా మరికొందరు వదిలేయండిలే కొత్తపెళ్లి కూతురు తెలియక ఏదో అనేసింది లైట్ తీసుకోండి అంటున్నారు.

Samantha attend Raju Gari Gadhi 2 movie press meet and interview. Samantha says about RRG2.

samantha
nagarjuna
raju gari gadhi 2 movie
ohmkar director