రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేశాడో గాని, ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టిడిపికి వ్యతిరేకంగా ఏం చూపెట్టి రచ్చ చేస్తాడో అని టిడిపి నేతలు హడలి పోవడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లో కొచ్చి వర్మ సినిమా చేస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు బుద్ది చెబుతారని వాదించాడు. అయినా వర్మ వెనక్కి తగ్గకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వైసిపి ఎమ్యెల్యే నిర్మిస్తున్నాడని అగ్గి రాజేశాడు. అలాగే రోజాకి ఒక పాత్ర ఇస్తానని అధికారికంగా మీడియాకి చెప్పాడు.
ఇక వైసిపి, లక్ష్మి పార్వతికి అనుకూలంగా సినిమా ఉంటుందని టిడిపి నేతలు ఫిక్స్ అవడము....వర్మ మీద రాళ్ళేయ్యడమూ జరుగుతున్నాయి. సోమిరెడ్డి లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిని హీరోయిన్ గా తీసుకోండి... అసలు ఎన్టీఆర్ గురించి మీకేమి తెలుసు అంటే.. లక్ష్మి పార్వతి హీరోయిన్ అయితే మీరు హీరోగా చేస్తారా అని వర్మ సోమిరెడ్డికి కౌంటర్ ఇచ్చాడు.
మళ్ళీ టిడిపి నేత అనిత కూడా ఎన్టీఆర్ పేదల పట్ల దేవుడు, అయన చేసిన మంచి పనులన్నీ సినిమాలో చూపిస్తారా? రాజకీయంగా చంద్రబాబుని తట్టుకోలేక వైసిపి నేతలు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కిస్తున్నట్టుగా వుంది? ఎన్టీఆర్ పై మీరు తీస్తున్న సినిమాతో చరిత్రని వక్రీకరించొద్దు? అలాగే ఎన్టీఆర్ వంటి దేవుణ్ణి చీప్ గా చూపిస్తే ప్రజలు, టిడిపి నేతలు కావాల్సినంత బుద్ది చెబుతారని మీడియా సమావేశంలో మాట్లాడగా.... దానికి వర్మ అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఎన్టీఆర్ బయోపిక్ కాదని.... లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి... ఆయన మరణించేవరకు ఉన్న పరిస్థితులను సినిమా చేస్తానని చెప్పడమే కాదు.. టిడిపి పుట్టక ముందు నుండి మీరిచ్చే వార్నింగ్ కి విసుగెత్తిపోయాను అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.