Advertisementt

మామ కోడలు ప్రమోషన్ దున్నేస్తున్నారు!

Fri 13th Oct 2017 11:42 AM
nagarjuna,samantha,raju gari gadhi 2,raju gari gadhi 2 promotion,after marriage samantha promotes rgg2  మామ కోడలు ప్రమోషన్ దున్నేస్తున్నారు!
Nagarjuna and Samantha Promotes Raju Gari Gadhi 2 మామ కోడలు ప్రమోషన్ దున్నేస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత ముఖ్యపాత్రలు పోషిస్తూ అశ్విన్, సీరత్ కపూర్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన 'రాజు గారి గది2'  సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కువగా నాగార్జున, సమంతలు కనబడుతున్నారు. చిన్న చిత్రంగా మొదలైన 'రాజు గారి గది2' నాగార్జున, సమంతలు నటిస్తున్నారు అనగానే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. అందులోను సినిమా మొదలయ్యే నాటికి నాగార్జున, సమంతలు మామ కోడలు కారు. ఇప్పుడు సినిమా విడుదల సమయానికి నాగార్జున మామగారు హోదాలో సమంత కోడలి హోదాలో ఉన్నారు.ఈ దెబ్బకి సినిమా క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ఇక నాగార్జున, సమంతలు కూడా ఈ సినిమాకి ఎంతకావాలో అంత పబ్లిసిటీ చేస్తున్నారు. ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం దగ్గరనుండి వెబ్ మీడియా, ప్రింట్ మీడియా దేన్నీ వదలడం లేదు. 'రాజు గారి గది2' తమ సొంత సినిమా అన్న మాదిరిగా నాగ్, సమంతలు ఈసినిమాని తమ భుజాల మీద మోస్తున్నారు. నాగార్జున మెంటలిస్ట్ గా... సమంత ఆత్మగా కనబడనున్న ఈ సినిమాలో గ్లామర్ డాల్ సీరత్ కూడా తన అందచందాలతో రెచ్చిపోనుంది. ఇక నాగార్జున ఇప్పుడు కూడా రాజుగారి ప్రమోషన్స్ లో హుషారుగా పాల్గొంటుంటే.... సమంత అయితే పెళ్ళై కనీసం వారం గడవకముందే రాజుగారి ప్రమోషన్స్ లో మెరిసింది.

నాగ చైతన్య - సమంత వివాహతంతు ముగిశాక నాగార్జున, సమంతలు రాజుగారి ప్రమోషన్స్ లో వాలిపోయారు. మామ కోడలు హోదాలో 'రాజు గారి గది2' ఇంటర్వ్యూలు ఇచ్చేసి హైలెట్ అయ్యారు. ఇక ఈ ఇంటర్వ్యూ త్వరలోనే పలు ఛానల్స్ లో ప్రసారం కానుంది అంటున్నారు. ఏది ఏమైనా నాగ్, సమంతలు తమకున్న బాధ్యత కన్నా ఎక్కువ బాధ్యతే తీసుకుని 'రాజు గారి గది2'ని ఒడ్డున పడేయాలని కంకణం కట్టుకున్నారనేది మాత్రం వాస్తవం.

Nagarjuna and Samantha Promotes Raju Gari Gadhi 2:

Raju Gari Gadhi 2 Movie Total Promotion on Nagarjuna and Samantha Hands

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ