చిన్న సినిమాగా విడుదలైన ఫిదా చిత్రం అదిరిపోయే విజయం సాధించి రికార్డులు సృష్టించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి - వరుణ్ తేజ్ జంటగా సైలెంట్గా తెరకెక్కిన ఈ చిత్రం అంతే సైలెంట్ గా విడుదలై ఏ హడావిడి లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫిదా చిత్రం విడుదలై రెండున్నర నెలలు కావొస్తుంది. బంపర్ హిట్ అయిన చిత్రం బుల్లితెరపై కూడా దర్శనమిచ్చింది. బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఫిదా ఫుల్ రన్లో ఏకంగా 90 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. కేవలం 10 కోట్లు అటు ఇటుగా బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. అలాగే ఫిదా చిత్రం విడుదలకు ముందు థియేట్రికల్ హక్కుల్ని అమ్మింది కూడా కేవలం 18 కోట్లకే. కానీ ఈ చిత్రం ఫుల్ రన్లో 48 కోట్ల షేర్.. 90 కోట్ల గ్రాస్ వసూలు చేయడం మాత్రం సంచలనాత్మక విజయమే.
రెండు తెలుగు రాష్ట్రాలలోను ఫిదా చిత్రం 37 కోట్లకు పైగా షేర్... .68 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. అంతేకాకుండా నైజాం ఏరియాలో ఫిదా ఏకంగా 18 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి స్టార్ హీరో సినిమాలకు దీటుగా నిలిచింది. ఇక ఫిదా చిత్రం ఓవర్సీస్ లోను మిలియన్ క్లబ్బును దాటేసింది. అలాగే కర్ణాటకలోనూ ఈ చిత్రం 6 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. కేవలం థియేట్రికల్ రన్‌తోనే ఫిదా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాదు... శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కుల ద్వారా మరింతగా నిర్మాత దిల్ రాజుకు ఆదాయం తెచ్చిపెట్టింది.
సాయి పల్లవి మ్యానియాతోనే ఫిదా చిత్రం ఇలాంటి కలెక్షన్స్ సాధించిందనేది మాత్రం వాస్తవం. ఈ చిత్రంతో శేఖర్ ఖమ్ములకి, వరుణ్ తేజ్ కి పెద్దగా పేరు రాకపోయినా కూడా ఫిదా చిత్రం కలెక్షన్స్ తో వారిద్దరూ కూడా ఫుల్ హ్యాపీ.