ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కిస్తానని నందమూరి బాలకృష్ణ ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని... ఎన్టీఆర్ జీవితంపై ఇప్పుడు రెండు సినిమాలు పోటాపోటీగా సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు తేజ... బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తుండగా... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్ ని వచ్చే జనవరి నుండి సెట్స్ మీదకెళుతుందని దర్శకుడు తేజ ప్రకటించాడు. ఇక దీనికన్నా ముందు అంటే మంగళవారం రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకెళుతుందని ప్రకటించాడు.
బాలకృష్ణ ఏమో ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ చివరి దశలో ఉందంటే... వర్మ ఏమో స్క్రిప్ట్ రెడీ అంటున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ హీరో బాలకృష్ణ. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హీరో ప్రకాష్ రాజ్ హీరో అని ప్రచారం జరుగుతున్నప్పటికీ... వర్మ కాదని క్లారిటీ ఇస్తున్నాడు. రెండు సినిమాలకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వాయువేగంతో జరిగిపోతున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి సాయి కొర్రపాటి, సిసిఎల్ విష్ణు, బాలయ్య నిర్మాతలుగా వుంటున్నారు అంటున్నారు. మరో పక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత వైసిపి ఎమ్యెల్యే రాకేష్ రెడ్డి అని అధికారిక ప్రకటన చేశాడు.
మరి ఎన్టీఆర్ బయోపిక్ మొత్తం టిడిపికి అనుకూలంగా తెరకెక్కుతుంది అంటుంటే.... వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం టిడిపికి వ్యతిరేకంగా లక్ష్మీ పార్వతికి అనుకూలంగా తెరకెక్కుతుంది అంటూ ప్రచారం మొదలైంది. మరి ఇప్పటికే లక్షిస్ ఎన్టీఆర్ చిత్రంపై టిడిపి నేతలు రాళ్లేస్తున్నారు. దానికి వర్మ కూడా ధీటుగా జవాబులిస్తున్నాడు. మరి బాలకృష్ణ వైపు నుండి సైలెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ దూసుకొస్తుంటే... వర్మ సైడ్ నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం రచ్చ రచ్చగా మొదలుపెడుతున్నారు.