డిమాండ్ ఉన్నప్పుడు మన హీరోయిన్లు తమ బిగువు చూపిస్తుంటారు. తెలుగులో చేసిన తర్వాత బాలీవుడ్‌కో లేక ఇంకో వుడ్‌కో వెళ్తే తెలుగు గురించి చులకనగా మాట్లాడుతారు. అలియాభట్.. అక్కినేని అఖిల్‌తో నటిస్తున్నారా? అంటే అక్కినేని వంశమే తెలియదని చెప్పింది. కానీ ఇప్పటికీ తమ చిత్రాలలో ఆమెను నటింపజేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇక తాప్సి అయితే నేషనల్ మీడియాలోనే మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై కొబ్చరి చిప్పలు బొడ్డుమీద విసరడం ఏమి శృంగారం? అంటూనే తెలుగులో చెత్త సినిమాలు వస్తుంటాయని అంది. ఇక రాధికాఆప్టే తెలుగువారిపై వేసిన నిందలు అన్ని ఇన్నికావు. కానీ మన సినీ పెద్దలు వారిని ఎండగట్టరు. సోషల్ మీడియాలో నెటిజన్లే మన సినిమా వారు చేయాల్సిన పనులను చేస్తూ వారికి కౌంటర్లు ఇస్తున్నారు. మీడియా అలా మాట్లాడిన వారిపై ఫైర్ అవుతున్నా మన సినీ పెద్దలకు అది కనిపించదు. ఎంతసేపు మీడియా, రివ్యూల గొడవలు తప్ప తెలుగువారి ఆత్మగౌరవం ఏనాడో నాశనమైపోయింది. అదే కన్నడసీమను చూడండి.
వారు ఏ విషయంలోనైనా ఒకే మాదిరి కలిసి కట్టుగా ఉంటారు. 'అన్నది నన్ను కాదు కదా...! వేరే వాడిని కదా...!' అని తమలో తాము ఆనందపడే తెలుగు సినీ పెద్దల వంటి శాడిస్టులు వారు కాదు.. దీనికి తాజాగా ఓ ఉదాహరణ చెప్పవచ్చు. డబ్బింగ్ చిత్రాలనే బ్యాన్ చేయగలిగిన కన్నడిగుల ఆత్మగౌరవం ఏమిటో కన్నడ స్టార్ జగ్గేష్ నిరూపించాడు. అందునా అది తనకు సంబంధం లేని విషయం. తాజాగా కన్నడ నిర్మాత ఒకరు తమ చిత్రంలో శృతిహాసన్ నటిస్తోందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వెంటనే శృతిహాసన్ తాను ఏ కన్నడ చిత్రంలో చేయడం లేదని, బాలీవుడ్‌లోనే ఏలిన దానిని తాను ఎప్పుడు కన్నడలో చేయనని తూలనాడింది. ఆ మాటకు జగ్గేష్‌కి ఒళ్లు మండిపోయింది.
శృతిహాసన్ కంటే అందగత్తెలు కర్ణాటకలో కన్నడిగుల్లో ఎందరో ఉన్నారు. శృతిహాసన్‌ని మేకప్ లేకుండా చూడలేం. మేకప్ తీసేస్తే జడుసుకుంటాం. అంత చండాలంగా ఉంటుందని డైరెక్ట్‌గా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మన రాష్ట్రంలోని, మన భాషా హీరోయిన్లను ఎంకరేజ్ చేయకుండా శృతిహసన్ వంటి పొగరుబోతుల చుట్టూ తిరడగం మన కన్నడ దర్శకనిర్మాతలు చేస్తున్న తప్పని, ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకొని పౌరుషంగా బతకాలని ఆవేశంగా స్పందించాడు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు కన్నడ నాట అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరి మన దర్శకనిర్మాతలు, హీరోల పరిస్థితి ఏంటో?