Advertisementt

పవన్ కుమారుడి ఫొటోపై.. జోకులా!

Thu 12th Oct 2017 12:01 PM
pawan kalyan,4th song,rgv,negative comments,jokes,baby boy  పవన్ కుమారుడి ఫొటోపై.. జోకులా!
Negative Comments and Pawan and His 4th son Photo పవన్ కుమారుడి ఫొటోపై.. జోకులా!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నాలుగో బిడ్డకు తండ్రి అయ్యాడు. ఎలా వచ్చిందో ఏమో గానీ పవన్‌ తన కొత్త కుమారుడిని మురిపెంగా చూసుకుంటున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరో పవర్‌స్టార్‌ పుట్టేశాడని పవన్‌ఫ్యాన్స్‌ పండుగలు చేసుకుంటున్నారు. పవన్‌ మూడో భార్య అన్నా లెజ్నివాకి పవన్‌కి ఆల్‌రెడీ ఓ కుమార్తె ఉంది. ఆ పాప పేరును కూడా అన్నాలెజ్నోవా క్రిస్టియన్‌ కావడంతో పొలెన్‌ అనే క్రిస్టియన్‌ పేరే పెట్టాడు పవన్‌. ఇక తాజాగా ఈ బాబుకి కూడా క్రిస్టియనిటీకి చెందిన పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఓ విప్లవయోధుని పేరును స్మరణకు తెచ్చేలా ఈ పేరు ఉంటుందని అంటున్నారు. ఇక అకిరాతో పాటు ఈ పసికందుని కూడా కాబోయే పవర్‌స్టార్‌ అంటూ పవన్‌ అభిమానులు అంటున్నారు.

మరోపక్క పవన్‌ తన బాబును మురిపెంగా చూసుకుంటున్న ఫొటోను చూసిన వివాదాస్పద దర్శకుడు వర్మ పవన్‌ ఎప్పటికంటే ఇప్పుడు ఎంతో క్యూట్‌గా ఉన్నాడని ఫేస్‌బుక్‌లో కామెంట్‌ పెట్టాడు. మరి ఈ బుల్లిబాబును వెక్కిరింతగా చేస్తూ పెట్టాడా? లేక పవన్‌ని వెక్కిరిస్తూ ఈ మెసేజ్‌ పెట్టాడా? అసలు ఆ వాక్యం అంతరార్ధం ఏమిటి? అనేది ఎవ్వరికీ అర్దం కావడంలేదు. మరోవైపు పవన్‌ తాతయ్య కావాల్సిన వయసులో మరలా తండ్రి అయ్యాడని కొందరు... పవన్‌ రాజకీయనాయకుడు కావడంతో రాజకీయాలలో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లలు వున్నవారే అర్హులు కదా..! మరి పవన్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదా? అని కొందరు, ఇద్దరినీ ఎన్నికల నాటికి దత్తత ఇచ్చేస్తాడులే అని మరికొందరు, అయినా పవన్‌ రేణూదేశాయ్‌కి విడాకులు ఇచ్చేశాడు కాబట్టి ఆయనకు చట్టరీత్యా అన్నాలెజ్నివాకి చెందిన పిల్లలే లెక్కలోకి వస్తారంటూ ఎన్నెన్నో వ్యంగ్యాస్త్రాలు వినపడుతున్నాయి. 

Negative Comments and Pawan and His 4th son Photo:

Ram Gopal Varma Comments on Pawan and His Song Photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ