ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sridevi Daughter Jhanvi Kapoor in Bikini

హాట్: బికినీలో శ్రీదేవి చిన్న కూతురు!

Sridevi Daughter Jhanvi Kapoor in Bikini

మన చాదస్తం గానీ ఇప్పటికి మనం శ్రీదేవిని అతిలోక సుందరి అనే కీర్తిస్తుంటాం. కానీ ఆమె ఓవర్‌మేకప్‌, మోడ్రన్‌ డ్రస్సులు చూస్తే పలువురు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 'ఇంగ్లీష్‌-వింగ్లీష్‌, పులి, మామ్‌' చిత్రాలలో శ్రీదేవిని చూసిన వారు చూసి షాకయ్యారు. కానీ తాజాగా ఓ ఫ్యాషన్‌షోలో పాల్గొన్న ఆమె లైట్‌ మేకప్‌ ప్యాచెస్‌తో, కాస్త పద్దతిగా డ్రస్‌ చేసుకుంది. ఆ డ్రస్సులో మాత్రం ఓ ముప్పైఏళ్ల ముందటి శ్రీదేవి కనిపిస్తోందని ప్రశంసలు అందుకుంది. 

ఇక శ్రీదేవి-బోనీకపూర్‌ పెద్ద కుమార్తె ఇప్పటికే హాట్‌ ఫొటోస్‌, లవర్స్‌, ప్రేమాయణం, ఎఫైర్స్‌లో వార్తల్లో ఉంటూనే ఉంది. త్వరలో ఈమెను హీరోయిన్‌గా తెరంగేట్రం చేయించనున్నారు. మరోవైపు వారి రెండో కూతురు ఖుషీ కపూర్‌ మాత్రం మొదటి నుంచి పెద్దగా వార్తల్లో లేదు. కానీ తాజాగా ఆమె తన ఫ్రెండ్స్‌తో సముద్రం ఒడ్డున సేదతీరుతూ బికినీ డ్రస్‌తో హాట్‌హాట్‌ ఫొటోలలో దర్శనమిస్తుండటంతో ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. మరి ఈ ఫొటోలు లీకయ్యాయా? పొరపాటున బయటికి వచ్చాయా? అనేది అర్ధం కావడం లేదు. 

ఈ ఫొటోలలో ఖుషీని చూసిన వారు శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్‌ కంటే ఖుషీ కపూరే అందంగా ఉందని, ఆమె శ్రీదేవి కంటే అందంగా కనిపిస్తోందని, టీనేజ్‌లోని శ్రీదేవిని మరిపించేలా ఉందని ప్రశంసలు లభిస్తున్నాయి. మొత్తానికి ఈ కపూర్‌ సిస్టర్స్‌ భవిష్యత్తులో బాలీవుడ్‌నే కాదు.. దేశాన్నే సినిమా నటీమణులుగా ఏలటం ఖాయమంటున్నారు. ఇక శ్రీదేవి వరస చూస్తే ఇప్పటికీ హీరోయిన్‌గానే నటిస్తాననే డిమాండ్‌ చేస్తున్న సమయంలో ఆమె కూతుర్లకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలో మేకర్స్‌కే తెలియాలి...!

Sridevi Daughter Jhanvi Kapoor sensation with Bikini Photos

sridevi daughter
jhanvi kapoor
bikini photos
beach