సాధారణంగా పెద్ద పెద్ద సంగీత దర్శకులకు మాత్రమే ట్యూన్స్‌తో పాటు బిజీఎం కూడా అదిరిపోయే విధంగా ఉండేలా చేయగల సత్తా ఉంటుంది. ట్యూన్స్‌లో మాస్, క్లాస్, మెలోడీ, ఐటం,మాంటేజ్‌వన్ని రంగరింపజేసి రీరికార్డింగ్‌తో రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడంలో నాడు ఇళయరాజా సుప్రసిద్దుడు. ఇక బాలీవుడ్‌కి చెందిన బప్పిలహరి తనకు టైమ్ లేదనే సాకుతో మన వాసూరావు చేత బీజీఎం చేయించేవాడు. అలా చేసిన 'గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు' వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలుసు.
ఇక ఆ తర్వాత రాజ్-కోటిలలో కోటి పాటలకు ట్యూన్స్‌అందిస్తే, రాజ్ మాత్రం బీజీఎం ఇచ్చేవాడు. ఇక ఇళయరాజా తర్వాత అటు ట్యూన్స్, ఇటు బీజీఎంలలో ఘనత వహించిన సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ. కాగా ఇప్పుడు తెలుగులో వారి తర్వాత సంచలనాలు రేపుతోన్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్. ఈయన తన సంగీతంతో చిత్ర జయాపజయాలను కూడా నియంత్రించే స్థాయిని ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'ఖైదీనెంబర్ 150, నేను లోకల్, డీజె, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకా, జై లవ కుశ'లతో అదరగొట్టాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిత్రం రీఎంట్రీ అందునా ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీనెంబర్ 150' లో దుమ్మురేపాడు.
ఇక ఇటీవల వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం'తో పాటు 'జయ జానకి నాయకా' చిత్రాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. ముఖ్యంగా 'జయ జానకి నాయకా' చిత్రంలోని హంసల దీవి ఫైట్‌లో ఆయన ఇచ్చిన బీజీఎం సినిమాను పీక్స్‌కి తీసుకెళ్లింది. ఇక 'జై లవ కుశ'లో ఎన్టీఆర్ నటన తర్వాత చెప్పాల్సింది దేవిశ్రీనే. ఇంటర్వెల్ సీన్‌లో ఎన్టీఆర్ నడిచొచ్చేటప్పుడు వెనుక నుంచి అందించిన బీజీఎం సినిమాకి అద్భుతమైన బ్యాంగ్‌నిచ్చింది. 'జై లవ కుశ' నే కాదు.. 'జయ జానకి నాయకా' కి కూడా ఇద్దరు హీరోలలో ఒకరు బోయపాటి అయితే మరొకరు దేవిశ్రీ అనే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన ఉన్న బిజీలో సుకుమార్ 'దర్శకుడు' కే కాదు.. బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కూడా సంగీతం అందించలేకపోయాడు.
కానీ రామ్ అదృష్టం కొద్ది ఆయన తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొంది ఈ నెల 27న విడుదలకు సిద్దమవుతున్న 'ఉన్నది ఒకటే జిందగీ' కి కూడా ప్రేక్షకుల్లో పాటిజివ్ బజ్ వచ్చేలా చేస్తున్నాడు. ఫ్రెండ్‌షిప్ డే కానుకగా వచ్చిన ఫ్రెండ్‌షిప్ పాటతో పాటు తాజాగా విడుదలైన 'వాట్ అమ్మా' పాట యూత్‌లో కేకపుట్టిస్తోంది. ఇన్‌స్టెంట్‌గా ఈ రెండు పాటలు హైలైట్ కావడంతో ప్రస్తుతం రామ్‌కి కూడా సంతోషంగానే ఉండి ఉంటుంది. ఇక 'వాట్ అమ్మా' పాటను తన ఎనర్జీ లెవల్స్‌కి తగ్గట్లు ట్యూన్ చేయడమే కాదు.. స్వయంగా ఆయనే పాడాడు. సో.. రాబోయే 'ఉన్నది ఒకటే జిందగీ'కి కూడా ఇద్దరే హీరోలు, ఒకరు రామ్, మరొకరు దేవిశ్రీనే అని చెప్పడం అతిశయోక్తికాదు.