వీర ప్రేమికుల్లాగా ఒకనాడు హృతిక్‌రోషన్, కంగనారౌనత్‌లు తిరిగారు. క్షణమైనా వదిలి గడపలేనంతగా విరహాన్ని, ప్రేమను ఒలకబోసుకున్నారు. కానీ బ్రేకప్‌లు అంటే సినీ ఫీల్డ్‌లో అందునా సెలబ్రిటీలలో కామనే కాబట్టి విడిపోయిందేదో విడిపోకుండా ఈ విషయాన్ని పెద్ద జాతీయ సమస్యగా మార్చివేశారు. నేడు ఇది ఇండో చైనాల సమస్య కన్నా, ఉత్తరకొరియా, అమెరికాల కంటే అణుబాంబు విషయాలకన్నా పెద్ద న్యూస్ అయిపోయింది. ఇక చిక్కిందే సందని మన టీవీ ఛానెల్స్ సైతం ఈ విషయంపై డిబేట్లు నడపడం, ఇంకా ఏదో సెన్సేషన్ న్యూస్‌ని వారి నుంచి వినిపించాలని ఉబలాపడుతున్నాయి. దాంతో తాజాగా ఓ మీడియా సంస్థ హృతిక్‌రోషన్‌ని ఇంటర్వ్యూ చేసింది.
ఇందులో ఆయన మాట్లాడుతూ, ఒక షూటింగ్ నిమిత్తం నేను, కంగనా యూనిట్‌తో కలిసి జోర్డాం దేశం వెళ్లాం. షూటింగ్ బాగా జరుగుతోంది. ఓ రోజు యూనిట్ హోటల్‌లో పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో నేను కూడా పాల్గొన్నాను. పార్టీ అయిపోయిన తర్వాత నేను లేచి వెళ్లిపోతున్న సమయంలో కంగనా వచ్చి నీతో మాట్లాడాలి అని అడిగింది. నేను బాగా అలిసిపోయి ఉండటంతో రేపు మాట్లాడుకుందాం అని చెప్పి రూమ్‌కి వెళ్లిపోయాను. కొద్ది సేపటి తర్వాత మద్యం మత్తులో వచ్చిన కంగనా నా రూమ్ తలుపులను బాదుతోంది. కంగనా తాగి రచ్చ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు రంగోళి 'అక్క గురించి చెడుగా ఏమీ అనుకోవద్దు... ఆమె చాలా మంచిది అని చెప్పింది'.. అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.
ఇక కంగనా ఎందుకు హృతిక్ తలుపులు కొట్టింది? మద్యం మత్తులో ఆమె అలా ఎందుకు చేసింది? అసలు ఆమె హృతిక్‌తో ఏమి మాట్లాడాలని భావించింది? ఏమి ఆశించి ఆయన రూమ్‌కి వెళ్లి తలుపులు తట్టింది? అనే పాయింట్స్ అన్నింటికి తగిన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే వర్మ వంటి వారి యూత్‌ఫుల్ మూవీ టైప్‌లో ఇంకా చెప్పాలంటే 'అర్జున్‌రెడ్డి' తరహాలో డ్రగ్స్‌లా ఓ కిక్ ఇచ్చే సినిమా అనే క్యాప్షన్‌తో సినిమా కూడా తీసిపారేస్తారు. అయినా ఓ మంచి కాఫీలాంటి సినిమా అని పెట్టినప్పుడు అసలే డ్రగ్స్ కేసు టాలీవుడ్ మెడకి ఎలాగూ ఉంది కాబట్టి 'మంచి కిక్‌నిచ్చే డ్రగ్ లాంటి సినిమా' అనే క్యాప్షన్ మాత్రం ఎందుకు పెట్టకూడదు చెప్పండి. మనసుంటే ప్రతి దానికి ఓ మార్గం ఉంటుంది. ఈ సీన్స్ ఇప్పుడు కాకపోయినా రాబోయే తరంలో హృతిక్ లేదా కంగానాల బయోపిక్‌కి వీరోచితంగా చిత్రించాలంటే మంచి మసాలా అందించే అంశాలుగా ఇవన్నీ చెప్పుకోవచ్చు.