ఈ రోజు సోమవారం తెలుగు సినిమా పరిశ్రమ ఇద్దరు వ్యక్తులను కోల్పోయింది. ఒకరు మాటల రచయిత ఎం.వి.ఎస్.హరనాథ రావు. మరొకరు ప్రముఖ మాజీ యాంకర్ మల్లిక.
ప్రముఖ సినిమా మాటల రచయిత, నటుడు ఎం.వి.ఎస్.హరనాథ రావు సోమవారం ఉదయం అనారోగ్య కారణాలతో మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో మాటల రచయితగా, నటుడుగా హరినాథరావు కి మంచి పేరుంది. హరి నాథరావు వయసు 69 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యం కారణంగానే నెల్లూరులోని రిమ్స్ ఆసుపత్రిలో యన ఈ రోజు ఉదయం తుదిస్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపివేసింది. హరినాథరావు మరణానికి తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం తెలియజేసింది.
ఒకప్పుడు యాంకర్ అనే పదానికి అర్ధం చెప్పిన యాంకర్ కమ్ నటి మల్లిక ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. మల్లిక అసలు పేరు అభినవ. గతంలో యాంకర్ గా పని చేసిన మల్లిక తర్వాత సినిమాల్లో చిన్న చితక వేషాలు వేస్తూ పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పారు. అయితే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన 39 ఏళ్ళ మల్లిక గత 20 రోజులుగా కోమాలోనే ఉన్నారని... ఈ రోజు ఉదయమే బెంగుళూరు ఆసుపత్రిలో మల్లిక కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. మల్లికకు ఉన్న అనారోగ్య కారణాలు ఏమిటి అనేది కూడా తెలియాల్సి ఉండగా ఆమె భౌతిక కాయాన్ని రేపు మంగళవారం ఉదయ హైదరాబాద్ కు తరలించనున్నారని సమాచారం అందుతుంది.