Advertisementt

సెహభాష్‌ బన్నీ.. అనొచ్చుగా..!

Mon 09th Oct 2017 05:27 PM
allu arjun,bunny,new director,naa peru surya naa illu india,allu arjun movies  సెహభాష్‌ బన్నీ.. అనొచ్చుగా..!
Allu Arjun in New Directors Route సెహభాష్‌ బన్నీ.. అనొచ్చుగా..!
Advertisement
Ads by CJ

పెద్ద పెద్ద స్టార్స్‌ తమ ఇమేజ్‌ని, క్రేజ్‌ని కాపాడుకుంటూ, వాటికి సూటయ్యే కథలను ఎంచుకుంటూనే తమకున్న పరిధిలో వైవిధ్యానికి ప్రయత్నించాలి. అది కత్తి మీద సాము వంటిదే. అయితే సరైన టాలెంట్‌ను, కథలను జడ్జ్‌ చేయగలిగితే మాత్రం ఇది వర్కౌట్‌ అయినంతగా ఏదీ వర్కౌట్‌కాదు. నిన్నటితరం స్టార్స్‌లో నాగార్జున అటు సీనియర్స్‌ని, ఇటు కొత్తవారిని ప్రోత్సహిస్తూ వైవిధ్యానికి పెద్ద పీట వేసే వాడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా బన్నీ మీద వస్తున్న వార్తలు వింటుంటే ఆయన కూడా తనదైన బాటలో వెళ్తున్నాడా? అనే నమ్మకం కలుగుతోంది. 

బన్నీ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క చిత్రం 'ఆర్య' మాత్రమే కొత్త దర్శకుడు సుకుమార్‌తో చేశాడు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావడమే కాదు.. బన్నీ ద్వారా ఇండస్ట్రీకి సుకుమార్‌ వంటి క్రియేటివ్‌ జీనియస్‌ లభించాడు. ఇక ఎంతో కాలం ఎన్టీఆర్‌ని నమ్ముకుని, నమ్ముకుని వచ్చిన స్టార్‌రైటర్‌ వక్కంతం వంశీని నేనున్నాను అంటూ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. దీంతో వక్కంతం వంశీని అల్లుఅరవింద్‌, అల్లుఅర్జున్‌ కలిసి నమ్మారంటే ఆయనలో కూడా ఏదో సమ్‌థింగ్‌ విషయం ఉందనే విషయం తెలుస్తోందంటున్నారు. ఇక ఈచిత్రం తర్వాత బన్నీ నటించే చిత్రం ఏమిటి? అంటే నిన్నటి వరకు 'జైలవకుశ' బాబి, లింగుస్వామి, మారుతి వంటి పేర్లు వినిపించాయి. 

తాజా సమాచారం ప్రకారం ఓ కొత్త యువకుడు బన్నీని ఊటీలో జరుగుతున్న 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' సెట్స్‌లో కలుసుకుని బన్నీకి ఓ లైన్‌ చెప్పాడట. ఈ లైన్‌ బన్నీకి ఎంతో బాగా నచ్చడంతో కథను పూర్తిగా డెవలప్‌ చేసుకుని రమ్మని, తాను మెచ్చే విధంగా కథను డెవలప్‌ చేస్తే దర్శకత్వ బాధ్యతలను కూడా నీకే ఇస్తానని చెప్పాడట. మరి ఈ కొత్త దర్శకుడు ఎవరనేది మాత్రం అల్లు ఫ్యామిలీ సీక్రెట్‌గా ఉంచుతోంది. మరి ఇదే నిజమైతే బన్నీ అందరూ నడిచే రొటీన్‌ దారిలో కాకుండా నలుగురు మెచ్చే కొత్త దర్శకుల వేట దారిలో ఉన్నాడని చెప్పవచ్చు. 

Allu Arjun in New Directors Route:

After Vakkantham Vamsi, Again Bunny will act with New Director 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ