Advertisementt

తన పేరును తానే పెట్టుకుందట....!

Mon 09th Oct 2017 12:30 AM
anushka,sweety,name change,anushka father,movies  తన పేరును తానే పెట్టుకుందట....!
Anushka about Her Name Change తన పేరును తానే పెట్టుకుందట....!
Advertisement
Ads by CJ

నటి అనుష్క అసలు పేరు స్వీటీనేనని అందరికీ తెలుసు. కాగా ఈ భామకు అసలు స్వీటీ అనే పేరు ఎందుకు వచ్చింది? అదే పేరు ఎందుకు స్ధిరపడిపోయింది? అనుష్క అనే పేరు తెరపైకి వచ్చింది? అనేది ఎంతో ఆసక్తిని కలిగించే విషయం. సహజంగా ప్రతి ఒక్కరికి అసలు పేర్లతో పాటు నిక్‌నేమ్స్‌ ఉంటాయి. ఇక సినిమా వారికి తమకు నచ్చిన, కలిసొచ్చిన, లేదా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం వేరే వేరే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి స్వీటీ సంగతికి వస్తే.. ఆమెకు ఆమె పిన్నమ్మ స్వీటీ అనే పేరు పెట్టింది. దాంతో అందరూ అదే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. 

తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు కావడంతో సాయి అని పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఎంతకీ ఆ తతంగం వాయిదాలు పడుతూనే వచ్చింది. దాంతో స్కూల్‌లో చేర్పించేటప్పుడు కూడా స్వీటీ అనే పేరునే రికార్డులలో రాశారు. కానీ స్కూల్లో అందరూ తన పేరు ఏమిటి? అని అడిగితే 'స్వీటీ' అని చెబితే నవ్వుకుని అదోలా చూసేవారు. ఇక 'సూపర్‌' షూటింగ్‌లో కూడా అందరూ స్వీటీ.. స్వీటీ అని పిలవడం చూసి నాగార్జున, సోనూసూద్‌లతో కలిసి ఈ విషయం చర్చించింది. వారు కూడా పేరు మార్చుకోమని సలహా ఇచ్చారు. 

ఆతర్వాత ఆమె తన తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెబితే.. నీ పేరు నువ్వే పెట్టుకునే అరుదైన ఛాన్స్‌ నీకే దక్కింది... పండగచేస్కో అని చెప్పి నచ్చిన పేరు పెట్టుకోమన్నారు. తర్వాత ఇంటర్నెట్‌లో, పిల్లల పేర్ల పుస్తకాలు అన్ని వెదికి చివరకు అనుష్క అనే పేరును నిర్ణయించుకుని తన స్నేహితులకు తెలిపింది. అలా ఆ పేరుకు ఆమె కూడా అలవాటు పడేందుకు ఏడాదికి పైగానే సమయం పట్టిందట. అదండీ స్వీటీ వెనుక అనుష్క పేరు రహస్యం. చాలా తమాషాగా ఉందిలెండి...! 

Anushka about Her Name Change:

Anushka Father Decision on Her Name Change

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ