గతంలో టివి ఛానల్స్ లో సీరియల్స్ కి తప్ప డాన్స్ షోలకి గాని, గేమ్ షో లకి గాని, రియాలిటీ షోస్ కి గాని పెద్దగా ఆదరణ ఉండేది కాదు. అయితే ఢీ డాన్స్ షోతో డాన్స్ షోలకి, జబర్దస్త్ తో కామెడీ షోలకి, కొంచెం టచ్ లో ఉంటె చెబుతా, నెంబర్ 1 యారి, బిగ్ బాస్ షోలతో ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు కూడా టీవీ షోస్ కి అలవాటు పడ్డారు. ఒక ఛానల్ మీద పోటీకి మరో ఛానల్ ఇలాంటి గేమ్ షోస్ తో పోటీపడుతూ నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్స్ కోసం పోటీ పడుతూ నిత్యం హడావిడి చేస్తున్నాయి. అయితే మహిళా ఆదరణ ఉన్న టివి సీరియల్స్ కి మాత్రం ఎటువంటి ఆదరణ తగ్గకుండా తమ టిఆర్పి రేటింగ్స్ తో ఇలాంటి గేమ్ షోస్ కి మంచి పోటీ నిస్తున్నాయి.
ఇప్పుడు కూడా రానా నెంబర్ వన్ యారి షోతో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో దాదాపు 10 వారాలు పోటీ పడింది. కొన్ని వారలు రానా పై చెయ్యి సాధిస్తే.. కొన్ని రోజులు ఎన్టీఆర్ పై చెయ్యి సాధించాడు. ఇక బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యానానికి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయ్యారో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్స్ లోనే అర్ధమవడమే కాదు... అత్యధికంగా టిఆర్పి రేటింగ్ సాధించింది బిగ్ బాస్ షో.. దాదాపు ఐదారు వరాల పాటు స్టార్ మా నెంబర్ 1 ఛానల్ గా అవతరించింది. ఆతర్వాత బిగ్ బాస్ కి కొద్దిగా ఆదరణ తగ్గి రానా నెంబర్ 1 యారి టాప్ కి వెళ్ళిపోయి జెమిని ఛానల్ కూడా టాప్ లోకి వెళ్ళిపోయింది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మాత్రం ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్ కి ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయ్యారో ఆ ఛానళ్ల కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ తెలియజేస్తుంది.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని ఒంటి చేత్తో సక్సెస్ చేసి ఎన్టీఆర్ అదరహో.. అనిపించి విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. షో ఆధ్యంతం ఎన్టీఆర్ మాటలతో ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. అయితే ఈదెబ్బకి స్టార్ మాకి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి గాను 14.13 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసుకుంది. తోలి ఎపిసోడ్ కి అత్యధికంగా 16 టీఆర్పీ రేటింగ్ సాధించిన ఈ షో మళ్లీ చివరి ఎపిసోడ్ కి ఇలా అత్యధిక టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరి బిగ్ బాస్ సీజన్ వన్ తో ఎన్టీఆర్ మాత్రం అన్ని విధాలా ఆకట్టుకుని స్టార్ మా ని నెంబర్ 1 గా నుంచోబెట్టాడనడంలో సందేహం లేదు.