లోకనాయకుడు కమల్‌హాసన్‌తో తెలుగింటి ఆడపడుచు అయిన గౌతమి చాలాకాలం సహజీవనం చేసింది. ఎదిగిన కూతుర్లు ఉండగా సహజీవనం చేసి తర్వాత కమల్‌తో అర్దాంతరంగా విడిపోయింది ఆమె. జయలలిత మరణం తర్వాత కాస్త రాజకీయాలు కూడా మాట్లాడి, బిజెపి నాయకులతో వరుస భేటీలు నిర్వహించి ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఆమె కూడా పోటీ చేస్తుందనే దాకా వార్తలు వచ్చాయి. దాని వల్లనే కమల్, గౌతమి విడిపోయారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నాడు ఆమె కొట్టిపారేసి,ఇదంతా ఉత్తదేనని కారణం చెప్పనవసరం లేదని చెప్పింది. ఇక తాజాగా కమల్‌హాసన్ కూడా రాజకీయాలలోకి వస్తున్న నేపధ్యంలో ఆమెను మీడియా మీరు కమల్‌హాసన్‌కి మద్దతిస్తారా? అని అడిగింది. దానికి ఆమె స్పందిస్తూ 'ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? కొంతకాలం సహజీవనం చేసినంత మాత్రాన రాజకీయాలలో కలిసి నడుస్తామని అనుకోనవసరం లేదు. రజనీ గానీ కమల్ గానీ రాజకీయాలలోకి వచ్చి పార్టీలను పెడితే అవి వారి సొంత నిర్ణయాలు గానే భావిస్తాను'.. అని చెప్పింది.
ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి, వారికోసం పోరాడుతారో వారికే తన మద్దతు ఉంటుందని తెలిపింది. ఇప్పటికిప్పుడు రాజకీయాలలోకి రావాలన్న కోరిక కూడాలేదని చెప్పేసింది. ఇక మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఏర్పడి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ గురించి స్పందిస్తూ ప్రలోభాలకు లోను కాకుండా అది పారదర్శకంగా పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపింది. అయినా కమల్‌హాసన్‌కి సపోర్ట్ ఇస్తారా? అన్నందుకు అంత కస్సుమని లేచిన ఆమె కమల్ బహుశా సహజీవనంని కూడా చట్టబద్దం చేస్తేనే ఈమె మద్దతిస్తుందనే కండీషన్ ఏమైనా పెట్టిందేమో అని సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఎంతైనా ఆదర్శ జంట కదా...! ఇక రజనీ ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకునే ముందు ఆయనకు హిమాలయాలకు వెళ్లి కొంతకాలం పాటు ఉండి ఆ నిర్ణయం తీసుకునే అలవాటు ఉంది. కాగా వచ్చే నెల మొదట్లో రజనీ హిమాలయాలకు ప్రయాణం కానున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అదే నిజమైన పక్షంలో రజనీ రాజకీయాలోకి వస్తాడా? లేదా? అన్న అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టి ఆయన రాజకీయాలలోకి వచ్చినట్లుగానే భావించాల్సిఉంటుంది.