ఈదసరాకి మహానుభావుడు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు ఆ విజయోత్సాహంలో మునిగితేలడమే కాదు తన తదుపరి చిత్రాల మీద కూడా దృష్టి సారించాడు. మారుతీతో మహానుభావుడు చిత్రం చేస్తున్నప్పుడే స్వామి రారా దర్శకుడు సుధీర్ వర్మతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ చెయ్యబోయే ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఆ సినిమాతోపాటే డైరెక్టర్ రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు శర్వా. అయితే ముందుగా ఏ దర్శకుడితో శర్వా సినిమాని మొదలెడతాడో మాత్రం క్లారిటీ లేదు.
అయితే ప్రకాష్ తో చెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ ఎక్కువగా ఫారిన్ షెడ్యూలు తో కూడుకున్నది కావడంతో.... ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది నటీనటుల వీసాలకు సంబంధించి ఉంటుందంటున్నారు. అయితే సుధీర్ వర్మ తన స్క్రిప్ట్ లో శర్వానంద్ ని రెండు షేడ్స్ ఉన్నకేరెక్టర్ లో చూపిస్తాడని టాక్ వుంది. మాఫియా లీడర్ గా ఎదిగిన కుర్రాడి కథతో సుధీర్ వర్మ, శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకుంటే బావుంటుందని అనుకుంటున్నాడట సుధీర్ వర్మ.
ఇప్పటికే అనుపమతో... శతమానంభవతి హిట్ కొట్టిన శర్వాకి మరోసారి అనుపమ్ కరెక్ట్ అనుకుంటున్నాడట ఈ దర్శకుడు. అయితే అనుపమ డేట్స్ అడ్జెస్ట్ చేసే పరిస్థితుల్లో లేదని.. ఆమె గనక ఖాళీ లేకపోతే నివేత థామస్ ని తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఫైనల్ గా శర్వానంద్ పక్కన అనుపమ మరోసారి నటిస్తుందో... లేకుంటే ఆ అవకాశం నివేతకి దక్కుతుందో చూద్దాం.