నేడు ఉన్నయంగ్ డైరెక్టర్లలో 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్ది వంగా కంటే ముందు వివాదాలతో మంచి ఫేమ్ సృష్టించుకున్న దర్శకుడు మారుతి. ఆయన మొదట్లో కాస్త అడల్ట్ చిత్రాలు తీయడంతో బూతు దర్శకుడు అనే ముద్ర పడింది. ఆ తర్వాత 'ప్రేమకధా చిత్రమ్'తో హర్రర్ కామెడీ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినా ఆయన సినిమా హిట్టయితే వెనుకుండి అన్నీ నేనే చేశానని చెబుతాడని, అదే ఫ్లాపయితే మరో అసిస్టెంట్ మీదనో లేక కెమెరామెన్ మీదకు తోసేస్తాడని కూడా చెడ్డ పేరు ఉంది. ఇక మారుతి చేసిన 'కొత్తజంట' చిత్రం బాగా ఆడకపోయినా మారుతి అన్నిరకాల కథలను తీయగలడని నిరూపించింది మాత్రం అల్లుఅరవిందే. ఆయన తన అనుభవంతో కొత్త మారుతికి జీవం పోశాడు.
నానిని స్టార్ ని చేసిన 'భలే భలే మగాడివోయ్' తో ఆయన తాను చిన్న పాయింట్‌ని తీసుకుని తక్కువ బడ్జెట్, హైక్వాలిటీ వంటివి ఇస్తూ సినిమా సక్సెస్‌లకు కేరాఫ్‌గా తయారైనాడని తాజాగా విడుదలైన 'మహానుభావుడు' చిత్రంతో ప్రూవ్ అయింది. ఈ దసరాకి వచ్చిన చిత్రాలలో అసలు సిసలు హిట్‌గా రాణిస్తూ, రోజురోజుకి కలెక్షన్లతో పాటు థియేటర్లను కూడా పెంచుకుంటోంది. ఇక మారుతి అంటే అల్లుఅరవింద్ కే కాదు అల్లుఅర్జున్‌కి కూడా బాగా నమ్మకం. తన చిత్రాల, పేర్ల విషయంలో న్యూమరాలజీ తెలిసిన మారుతి సలహాను బన్నీ ఎప్పుడు తీసుకుంటాడు. ఇక ఆయన త్వరలో బన్నీతో చిత్రం చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో చేసే చిత్రం కోసం స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఇక ఆయన దగ్గర బోలెడు కథలున్నా ఇంకా బెటర్ అవుట్‌పుట్ తెచ్చి సింగిల్ సిట్టింగ్‌లో గన్ షాట్ వంటి స్టోరీతో బన్నీని మెప్పించాలని చూస్తున్నాడంట. ఇక మారుతి సన్నిహితులు కూడా బన్నీతో చిత్రం ఖాయం, కానీ ఎప్పుడనేదే డౌట్... వీలుంటే 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత వెంటనేనైనా ఉండవచ్చని అంటున్నారు.
మరో ఆసక్తికర వార్త ఏమిటంటే.. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని ఆయన తండ్రి 'జయదేవ్' ద్వారా పరిచయం చేశాడు. కానీ కటౌట్ ఉంటే కాదు... కూసింత టాలెంట్ కూడా కావాలని ఇంకా ఈ తండ్రి కొడుకులకు అర్ధం కాలేదు. అప్పటికే ఫేడవుట్ అయిన జయంత్ సి.పరాన్జీని పెట్టుకుని 'ప్రభాస్‌ని పరిచయం చేసిన దర్శకుడితో తీస్తున్నామని' బోల్తా పడ్డారు. కాగా గంటా తండ్రి కొడుకుల కళ్లు ఇటీవల మారుతిపై పడ్డాయి. ఎంత అడిగినా ఇస్తామంటున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు అరవింద్, అర్జున్ చేత కూడా రికమెండేషన్స్ అయితే వెళ్లాయట. మరి మారుతి ఒప్పుకుంటాడో లేదో వేచిచూడాల్సి వుంది..!