ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అందరూ వెన్నుపోటు దారునిగా గుర్తిస్తారు. మరీ ఆయనకు విరోధులైతే ఆయన వాడుకొని వదిలేసే నేప్‌కిన్ టైప్ అని కూడా సెలవిస్తూ ఉంటారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌కి, నందమూరి కళ్యాణ్‌రామ్, నందమూరి హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందరేశ్వరి వంటి వారికి బాగానే అర్ధమైంది. ఇదే పరిస్థితి పవన్‌కి కూడా రేపో మాపో తప్పదనే వ్యాఖ్యలు వస్తుంటాయి. చంద్రబాబునాయుడులో ఉన్న కుటిల నీతి ఏమిటంటే.. తన మనసులోని భావాలను, విషయాలను ముందుగా గాసిప్స్‌గా అందరిముందుకు తీసుకువస్తారు. ఆ డోస్ కూడా చాలకపోతే తన సహచరుల చేత, సన్నిహితులు, మంత్రులు, ఎమ్మెల్యేల చేత తాననుకున్నది అనిపిస్తాడు. ఆ తర్వాత ఆ మాటలకు వచ్చే రెస్సాన్స్, నెగటివ్ అయితే ఒక తరహాలో, పాజిటివ్ అయితే మరో తరహాలో స్పందిస్తాడు.
తాజాగా కేంద్రమంత్రిగా ఉన్న అశోక్‌గజపతిరాజు, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ.. వీరిద్దరు చంద్రబాబుకి నమ్మిన బంట్లు. దాంతో వారు తాజాగా పవన్‌కళ్యాణ్ అంటే తమకు ఆయనెవ్వరో తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో కూడా ప్రత్యేకహోదా విషయంలో సుజనా చౌదరి పవన్ వ్యాఖ్యలను, జల్లికట్టు స్ఫూర్తిని పందుల పోటీతో పోల్చినప్పుడు కూడా చంద్రబాబు ఇదే ఫార్ములా అప్లై చేశాడు. నాడు కూడా పవన్ మనకి ఆప్తుడు అని ఆయనను తనకేమీ తెలియకుండా మాట్లాడవద్దని మీడియా ముందు మొసలికన్నీరు కార్చాడు. ఇప్పుడు అశోక్‌గజపతిరాజు, పితాని సత్యనారాయణలు అధిష్టానం, ఇతరుల ప్రమేయం లేకుండా పవన్‌ని తమకి తెలియనది చెప్పేంత దమ్ము గానీ, ధైర్యం గానీ లేవు. ఈ విషయం ముదిరింది. పవన్ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. తానంటే అశోక్‌గజపతిరాజుకు, పితాని సత్యన్నారాణలకు తెలియదంట..... సంతోషమే అని పవన్ ఒకే ఒక్క పంచ్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరలా దూరంగా పోకుండా చంద్రబాబు వెన్నపూత పూస్తున్నాడు.
సున్నితమైన వ్యవహారాలపై స్పందించేటప్పుడు నాయకులు జాగ్రత్త వహించాలని, అధిష్టానం అనుమతి తీసుకోవాలని చెప్పి, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదన్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు. నిన్న బిజెపి నేతలు ఇలాగే అన్నారు. ఇప్పుడు టిడిపి నేతలు కూడా ఇదే అంటున్నారంటే సమ్‌థింగ్ జరుగుతోంది. మరి కిందటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బిజెపి, టిడిపిలకు ప్రచారం చేసిన పవన్, అశోక్, పితానిలకు తెలియకపోవడం చంద్రుని మాయాజాలమే మరి...!